ఎక్స్ క్లూజివ్ -లైగర్ బిజినెస్ డిటైయిల్స్

ఇస్మార్ట్ శంకర్ తరువాత మాస్..క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ తీస్తున్న సినిమా ‘లైగర్’. గత రెండేళ్లకు పైగా సెట్ మీద వున్న ఈ సినిమా పూరి తొలి పాన్ ఇండియా సినిమా. Advertisement ఇటీవల…

ఇస్మార్ట్ శంకర్ తరువాత మాస్..క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ తీస్తున్న సినిమా ‘లైగర్’. గత రెండేళ్లకు పైగా సెట్ మీద వున్న ఈ సినిమా పూరి తొలి పాన్ ఇండియా సినిమా.

ఇటీవల వదిలిన టీజర్, చేసిన పబ్లిసిటీతో సినిమాకు మాంచి క్రేజ్ వచ్చింది. ముందుగానే హిందీ డీల్ క్లోజ్ అయింది. తెలుగు డీల్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో అని ముందే ఫిక్స్ అయింది.అయితే రేటు ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నారు.

డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మొత్తం అన్ని భాషల లైగర్ ను అన్ని దక్షిణాది రాష్ట్రాలకు కొనుగోలు చేసారు. ఈ నాలుగు రాష్ట్రాలకు కలిపి, లైగర్ అన్ని భాషల వెర్షన్ లను ఆయన 70 కోట్లకు తీసుకున్నారు. అయితే మరో పది కోట్లు రికవరీ అడ్వాన్స్ గా ఇవ్వాలని పూరి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఆంధ్ర ఏరియాను ముఫై కోట్ల రేషియోలో ఇప్పటికే బిజినెస్ ను క్లోజ్ చేస్తున్నారు.

వైజాగ్ ఏరియాను దర్శకుడు కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ 30 కోట్ల రేషియోలో తీసుకున్నారు. అంటే విశాఖ ఏరియా ఏడున్నర కోట్లకు ఇచ్చారన్నమాట.అలాగే ఈస్ట్ గోదావరి ఏరియాను డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి తీసుకున్నారు. మిగిలిన ఏరియాలు డిస్కషన్ లో వున్నాయి.