బిగ్‌బాస్ సీజన్-4 ఫేమ్, ప్రముఖ సోషల్ మీడియా యాంకర్ అరియానా గ్లోరీకి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ సారీ చెప్పాడు. రాంగోపాల్‌వర్మతో చేసిన ఇంటర్వ్యూనే అరియానాకు పాపులారిటీ తెచ్చి పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ చేసిన సంచలన కామెంట్స్‌తో, అరియానాపై అందరి దృష్టి పడింది.
ఆ క్రేజ్‌తోనే ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ రియాల్టీ షో …బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంట్రీ దక్కింది. బిగ్‌బాస్ హౌజ్‌లో మొహం మీదే మాట్లాడుతూ, తోటి కంటెస్టెంట్స్‌తో గొడవ పడుతూ, డిఫరెంట్ మాటలతో తనకంటూ ప్రత్యేక శైలితో ప్రేక్షకుల ఆదరణకు అరియానా నోచుకున్నారు. ఆ ఆదరణే చివరి వరకూ అరియానా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగేలా చేసింది.
ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి ఆర్జీవీని అరియానా సంచలన ఇంటర్వ్యూ చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇందుకు సంబంధించి అరియానా, అర్జీవీల జిమ్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై, వైరల్ అయ్యాయి.
వినూత్న, సంచలన ఇంటర్వ్యూ కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఫొటోలు మినహా కనీసం టీజర్ కూడా విడుదల కాలేదు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి తాజాగా అరియానాకు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పడం ఆసక్తిగా మారింది.
‘హే అరియాన నువ్వు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నాం’ అంటూ తన ట్వీట్లో ఆయన రాసుకొచ్చాడు.
మొత్తానికి టీజన్ విడుదలకు ముందు అరియానాకు సారీ చెప్పడం విశేషం. టీజర్ సరే, అసలు ఇంటర్వ్యూ ఎప్పుడో మరి? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.