తమిళనాట విపరీతమైన క్రేజ్ వున్న హీరో ధనుష్ నేరుగా ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడని, ఓ సెన్సిటివ్ డైరక్టర్ దాన్ని రూపొందించబోతున్నారని కొన్ని రోజుల క్రితమే 'గ్రేట్ ఆంధ్ర' ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా అఫీషియల్ ప్రకటన ఈ రోజు వెలువడింది. ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్, తన భార్య జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రకటన విడుదల చేసారు.
సెన్సిటివ్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తొలిసారి ఈ పాన్ ఇండియా సినిమాను అందించబోతున్నారు. తమిళ, తెలుగు, హిందీల్లో ఈ సినిమాను రూపొందిస్తారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఏమిటంటే, ఈ సినిమాలో మరో మిడిల్ ఏజ్డ్ హీరో కూడా నటిస్తారు.
ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటారు అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. దాదాపు అరడజను పేర్లు పరిశీలనలో వున్నాయి. వీటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేస్తారు.
ఈ సినిమాకు పుష్కర రామ్మోహనరావు నిర్మాణ భాగస్వామి. సునీల్ నారంగ్ నిర్మాణ వ్యవహారాలు చూస్తారు. ఇదే టీమ్ నిర్మించిన లవ్ స్టోరీ విడుదలకు సిద్దంగా వుంది.