Advertisement

Advertisement


Home > Movies - Movie News

అరియానా..ఆర్జీవీ...భంగిమ 1..2..3

అరియానా..ఆర్జీవీ...భంగిమ 1..2..3

తెలుగు సినిమా ఇంటర్వ్యూలకు కొత్త టచ్ ఇవ్వడానికి డైరక్టర్ ఆర్జీవీ నడుంబిగించారు. యాంకర్ అరియానాకు జిమ్ డ్రెస్ వేసి, రకరకాల భంగిమల్లో షూట్ చేసారు. ఆ షూట్ లోనే క్వశ్చన్లు కూడా షూట్ చేసేలా ప్లాన్ చేసారు.

ఇదంతా కొన్ని రోజుల క్రితమే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేసారు. కేవలం భంగిమలు, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ తప్ప, వాయిస్ లేదు. కానీ కొన్ని కొన్ని సార్లు అరియానా సిగ్గుగా, మరి కొన్ని సార్లు చెవులు మూసుకుని ప్రోమోలో కనిపించింది.

దాన్ని బట్టి ఆయా చోట్ల ఎలాంటి డైలాగులు పడి వుంటాయో అర్థం అవుతోంది. ఒకటి రెండు రోజుల క్రితమే ఈ ప్రోమో గురించి ఫోటోలు వదులుతూ, ద్వందార్ధాలతో ఆర్జీవీ హడావుడి చేసారు. ఆ ద్వందార్ధాలు నేరుగానే ఇంటర్వ్యూలో వున్నాయని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

డైలాగుల్లేని ప్రోమోనే ఇలా వుంటే టోటల్ ఇంటర్వ్యూ  ఇంకెంత రంజుగా వుంటుందో అని యూ ట్యూబ్ వీక్షకులు బొలోమని చూసేయడం ఖాయం. ఆర్జీవీ కి కావాల్సింది అదే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?