జగన్ కేబినెట్ విస్తరణకు, టీటీడీ పదవికి లింకేంటి..?

ఈనెల 21తో టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని చైర్మన్ గా కొనసాగిస్తారా, లేక కొత్తవారిని నియమిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.  Advertisement గతంలో ఒంగోలు…

ఈనెల 21తో టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని చైర్మన్ గా కొనసాగిస్తారా, లేక కొత్తవారిని నియమిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

గతంలో ఒంగోలు ఎంపీగా ఉన్న సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డి కోసం తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డిని నియమించి లెక్క సరిచేశారు జగన్. అయితే ఆ పదవి కాలపరిమితి కేవలం రెండేళ్లు మాత్రమే.

ఈ దశలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా? దగ్గరి బంధువు పదవి కోసం జగన్ నియమాలను సడలించారనే విమర్శ ఎదుర్కొంటారా..? తేలాల్సి ఉంది.

కొత్త చైర్మన్ ఎవరు..?

టీటీడీ కొత్త చైర్మన్ రేసులో మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంగోలులో సుబ్బారెడ్డి సీటు త్యాగం చేసినట్టే, నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరికతో రాజమోహన్ రెడ్డి తన సీటు వదులుకున్నారు. దానికి బదులుగా మేకపాటి గౌతమ్ రెడ్డిని జగన్, తన కేబినెట్ లోకి తీసుకున్నారని అంటారు. 

వయోభారం రీత్యా రాజమోహన్ రెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉండే అవకాశం లేదు, దీంతో ఆయన టీటీడీ చైర్మన్ పదవి ఆశించారని, జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రచారం జరుగుతోంది.

కేబినెట్ విస్తరణతో లింకు..

టీటీడీ చైర్మన్ పదవిని అనుకున్నట్టే 2ఏళ్లకు మార్చేస్చే.. కచ్చితంగా తాను ముందే చెప్పినట్టు రెండున్నరేళ్లకు జగన్ తన కేబినెట్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అంటే సుబ్బారెడ్డిని మార్చేస్తే, 6 నెలల తర్వాత జరిగే కేబినెట్ విస్తరణకు కూడా పరోక్షంగా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క. మరి ఆ లెక్కలతో ఎవరెవరు తెరమరుగవుతారు, ఎవరు కొత్తగా తెరపైకి వస్తారనేది తేలాల్సి ఉంది.

టీటీడీ చైర్మన్ పదవి మేకపాటి కుటుంబానికిస్తే.. గౌతమ్ రెడ్డి నుంచి మంత్రి పదవి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా నుంచి, అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని చెబుతున్నారు. 

సో..  గౌతమ్ రెడ్డి పోస్ట్ కాకాణికి ఇవ్వడం, టీటీడీ చైర్మన్ పదవి రాజమోహన్ రెడ్డికి ఇవ్వడం.. ఇలా ఇదంతా ఓ లెక్క ప్రకారం జరిగే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద.. టీటీడీ చైర్మన్ పదవిలో సుబ్బారెడ్డిని కొనసాగించే విషయంతో జగన్ భవిష్యత్ నిర్ణయాలు కూడా ఆధారపడి ఉన్నాయి. 

ఇక్కడ చైర్మన్ ని మారిస్తే, అక్కడ కేబినెట్ లో మార్పులు చేర్పులు గ్యారెంటీ అనుకోవచ్చు. ఇక్కడ సుబ్బారెడ్డినే కొనసాగిస్తే.. మంత్రి మండలిలో మార్పుల కోసం మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందేననే సంకేతాలు ఇచ్చినట్టే అనుకోవాలి.