ట్విటర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు, ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఒంటికాలిపై లేచే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దఫా చంద్రబాబును మోసే ఎల్లో మీడియాపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలతో తనమార్క్ ట్వీట్ చేశారు.
‘ఒక దురుద్దేశ భావనను నిజం అని చూపించడానికి బాబు అను‘కుల’ మీడియా చేస్తున్న కుతంత్రాలు చౌకబారుగా, అసహ్యంగా ఉంటున్నాయని’’ నిప్పులు చెరిగారు.
ఢిల్లీలో సీఎం జగన్ గారు చేసిన అభ్యర్థనలను కేంద్రం తిరస్కరిస్తే బాగుండనే దుర్మార్గపు ఆలోచనలను ఏమనాలి? అలా అనుకోవడం ప్రజలకు నష్టం జరగాలని కోరుకోవడమే’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనను చిలువలుపలువలు చేసి ఎల్లో మీడియా పైశాచిక ఆనందాన్ని పొందిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏది చేసినా తప్పే అన్నట్టు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఎల్లో మీడియా తప్పు పడుతుండడాన్ని జనం జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాబు అను‘కుల’ మీడియా అంటూ విజయసాయిరెడ్డి దెప్పి పొడుస్తూ ట్వీట్ చేశారు. ఎల్లో మీడియా వైఖరిని తప్పు పట్టే క్రమంలో వాటి కుతంత్రాలు చౌకబారుగా, అసహ్యంగా ఉన్నాయని విజయసాయిరెడ్డి పేర్కొనడం గమనార్హం.