హీరో న్యూడ్ ఫొటో షూట్.. హీరోయిన్ల స‌పోర్ట్, పోలిస్ కేసు!

చిత్ర‌విచిత్ర‌మైన చేష్ట‌ల‌తో .. క్రేజీ ప‌నుల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించే బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ కు పోజులు ఇవ్వ‌డం దుమారాన్ని రేపుతూ ఉంది. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారాన్ని అస‌హ్యించుకుంటున్నారు…

చిత్ర‌విచిత్ర‌మైన చేష్ట‌ల‌తో .. క్రేజీ ప‌నుల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించే బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ కు పోజులు ఇవ్వ‌డం దుమారాన్ని రేపుతూ ఉంది. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారాన్ని అస‌హ్యించుకుంటున్నారు చాలా మంది. 

ఏ హీరోయినో ఇలా పోజులు ఇస్తే.. ఆశ్చ‌ర్య ప‌డే రోజులు పోయాయి. చాలా మంది న‌టీమ‌ణులు సోష‌ల్ మీడియాలోనే అర్ధ‌న‌గ్న పోజులు పోస్టు చేస్తున్నారు. వీటికైతే జ‌నాలు అల‌వాటు ప‌డ్డారు కానీ.. ఇలా ఒక  మ‌గాడు న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం మాత్రం అస‌హ్యాన్ని క‌లిగిస్తోంది. 

ఇలాంటి నేప‌థ్యంలో.. ర‌ణ్ వీర్ పై పోలిస్ కేసు కూడా న‌మోదు అయ్యింది. అత‌డి ఫొటో షూట్ పై ముంబైలో కేసు న‌మోదు అయ్యింది. న్యూడ్ పోజుల‌తో ర‌ణ్ వీర్ సింగ్ మ‌హిళ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాడ‌నే ఆరోప‌ణ‌తో మ‌హారాష్ట్ర‌లో ఈ న‌టుడిపై పోలిస్ స్టేష‌న్లో ఫిర్యాదు అందింద‌ట‌. ఈ మేర‌కు కేసు న‌మోదు అయిన‌ట్టుగా తెలుస్తోంది. సాధార‌ణంగా అయితే.. ఇలా న‌గ్నంగా పోజులు ఇవ్వ‌డం నేర‌మే!  అయితే దీనికి కొన్ని క్లాజులు ఉండ‌వ‌చ్చు.

చిన్న పిల్ల‌ల ముందు కావాల‌ని ఈ త‌ర‌హా పోజులు ఇవ్వ‌డం వంటి వ్య‌వ‌హారాల్లో అయితే కేసులు క‌ఠినంగా మార‌గ‌ల‌వు. ఇలా ఏ బ‌జార్నో ప‌డితే.. న్యూసెన్స్ కేసు న‌మోదు కావొచ్చు. మ‌రి ర‌ణ్ వీర్ ది ఫొటో షూట్! మ‌రి ఈ ఫోటోల‌ను ప్ర‌చారంలోకి పెట్టే వైనం ఏ మేర‌కు నేర‌మో చ‌ట్టం తేల్చాల్సి ఉంది. మొత్తానికి ఈ విప‌రీత చేష్ట‌తో ర‌ణ్ వీర్ లీగ‌ల్ ట్ర‌బుల్స్ ఎదుర్కొంటున్నాడు.

అద‌లా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంలో కొంద‌రు హీరోయిన్ల నుంచి ర‌ణ్ వీర్ కు పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింది. ఇత‌డి పైత్యాన్ని ఇత‌డి బాలీవుడ్ కొలీగ్స్ అలియా భ‌ట్, స్వ‌ర భాస్క‌ర్ వంటి వారు స‌మ‌ర్థించారు. అర్జున్ క‌పూర్ కూడా ఈ చేష్ట‌ను మెచ్చుకున్నాడు. అయితే చాలా మంది మాత్రం ఈ పైత్యం స్పందించ‌లేదు. 

నెటిజ‌న్లు ఇత‌డిని కొంద‌రు అస‌హ్యించుకుంటుండ‌గా, మ‌రి కొంద‌రు వెర్రోడి కింద జ‌మ క‌డుతున్నారు. అయితే ఈ ఫొటో షూట్ వెనుక ప్ర‌చార యావ‌, డ‌బ్బు ఒప్పందాలు కూడా ఉండ‌వ‌చ్చు. ఇప్పుడు కేసు అందుకు అద‌నం!