ఈస్ట్ గోదావరిలో మహర్షి సినిమాకు గట్టి చిక్కు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాను ఈస్ట్ లో మణికంఠ ఫిలింస్ కు ఇచ్చారు. అయితే వాస్తవానికి వేరే వాళ్లకు ఇవ్వాలని అనుకుంటే మణికంఠ ఫిలింస్ అడ్డంపడింది. తాము బ్రహ్మోత్సవం సినిమాకు దారుణాతి దారుణంగా లాస్ అయిపోయామని, సినిమాను తమకు ఇవ్వకుంటే ఇన్నాళ్లు పరిహారం ఇవ్వనిదానికి వడ్డీ కూడా తమకు నష్టమే అని అడ్డంపడ్డారు.
దాంతో బ్రహ్మోత్సవం నిర్మాత పివిపి కలుగచేసుకుని, మేటర్ సెటిల్ చేసి, సినిమాను వాళ్ల చేతిలోనే పెట్టారు. దీనివెనుక డీల్ ఏమిటన్నది తెలియాల్సి వుంది. అయితే ఇప్పుడు సమస్య మరోవైపు నుంచి వచ్చింది. గతంలో నాని-నాగ్ కాంబినేషన్ లోని దేవదాస్ విషయంలో తమకు కోటి నలభై లక్షల వరకు రికవరీ ఇవ్వాల్సి వుందని, అది తేలకుండా మహర్షి సినిమా విడుదల చేయడానికి వీల్లేదని వి4 డిస్ట్రిబ్యూటర్స్ ఈస్ట్ గోదావరి అసోసియేషన్ లో కంప్లయిట్ పెట్టారు.
ఈ మేరకు అక్కడ తీర్మానం కూడా చేసేసారు. ఆ మొత్తం సెటిల్ మెంట్ అయ్యేవరకు సినిమాను ఎవ్వరూ విడుదల చేయకూడదని. దేవదాస్ నిర్మాత అశ్వనీదత్, మహర్షి నిర్మాతల్లో ఒకరు అన్న సంగతి తెలిసిందే. ఇదే దేవదాస్ బకాయిల మీద నైజాంలో డిస్ట్రిబ్యూటర్ సునీల్ కూడా చాంబర్ లో కాగితాలు పెట్టారు. ఇప్పుడు ఈస్ట్ లో ఏకంగా తీర్మానమే చేసారు. నైజాంలో అంటే మహేష్ కు సునీల్ కు వ్యాపార బంధాలు వున్నాయి కాబట్టి ఏదో విధంగా ముందుకు వెళ్తారు. కానీ ఈస్ట్ లో మాత్రం అశ్వనీదత్ పైసలు కట్టకుండా పని జరిగేలా లేదు.