టీడీపీకి వివాదం రేగడమే కావాలి!

తెలుగుదేశం పార్టీ పుట్టి నలభయ్యేళ్లు అయ్యాయి. ఇన్నాళ్లలో వారికి ఎన్నడూ ప్రకాశం జిల్లా అనేది ప్రాధాన్యంగల జిల్లాగా కనిపించలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.  Advertisement తమ…

తెలుగుదేశం పార్టీ పుట్టి నలభయ్యేళ్లు అయ్యాయి. ఇన్నాళ్లలో వారికి ఎన్నడూ ప్రకాశం జిల్లా అనేది ప్రాధాన్యంగల జిల్లాగా కనిపించలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 

తమ మహానాడు సందర్భంగా ఎంత వివాదాలను రేపగలిగితే.. రాబోయే ఎన్నికలకు తమకు అంతగా మైలేజీ వస్తుందని వారు ఆరాటపడుతున్నారు. ఇలాంటి కుట్రపూరిత ఆలోచనల్లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరితేరినవారనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ క్రమంలో భాగంగానే.. మహానాడుకు ఇంకా సన్నాహాలు జరుగుతూ ఉండగానే.. సమాంతరంగా వివాదాలను కూడా ప్రారంభిస్తున్నారు.

ఒంగోలు పట్టణంలో దార్లు మూసుకుపోయే మాదిరిగా రోడ్ల మీద వాళ్లు తోరణాలు కట్టారు. సరే.. మహానాడు వంటి భారీ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఆ మాత్రం హడావుడి సహజమే అని కూడా అనుకోవచ్చు. అయితే అలా కట్టడానికి సంబంధించి కార్పొరేషన్ అధికార్లనుంచి అనుమతులు తీసుకోవాలి కదా.. అది కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు. వీళ్లంతట వీళ్లు కట్టేసేసరికి కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు. 

రోడ్డుమీద కట్టిన తోరణాలు తీసేసారని తెలుగుదేశం నాయకులు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. మేం తోరణాలు కట్టుకుంటూపోతే, మీరు తొలగిస్తూ ఉంటారా? అని అరుస్తున్నారు. వారం కిందటే మేం అనుమతుల కోసం దరఖాస్తు చేశాం అంటున్నారు. అనుమతులు అడిగినవాళ్లు, అనుమతి వచ్చేదాకా ఆగాలి కదా. అనుమతి రాకపోతే.. మళ్లీ మళ్లీ అడగాలి కదా!

నిజానికి ప్రజాస్వామ్యంలో ఏవ్యవస్థ కూడా సుప్రీం కాదు. అధికారులు అనుమతి ఇవ్వకపోతే.. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోర్టుకు వెళ్లవచ్చు. గతంలో ఫలానా సందర్భాల్లో రోడ్ల మీద ఇతర పార్టీలు తోరణాలు కట్టుకున్నారు. అందుకు అనుమతులు ఇచ్చారు.. అని ప్రస్తావిస్తూ తమకు నిర్వహణ తేదీ దగ్గర పడింది గనుక.. తక్షణం అనుమతించాలని అడగవచ్చు. కోర్టు ఆ మేరకు సూచనలు చేస్తుంది. ఈ ఏర్పాటు ఉంది. పద్ధతి ప్రకారం పని జరుగుతుంది. 

కానీ తెలుగుదేశం వారికి కావాల్సింది పద్ధతి ప్రకారం పని జరగడం కాదు. వివాదం రేగడం మాత్రమే! అందుకే అనుమతులు రాకముందే తోరణాలు కట్టేసి వాటిని తీసేయగానే గోలగోల  చేస్తున్నారు. ఆల్రెడీ గ్రౌండు గురించి ఒకసారి గోల చేశారు. దాన్ని ప్రజలు ఎవ్వరూ పట్టించుకోలేదు. 

ఇప్పుడు తోరణాల గోల! మహానాడులో ఎటూ ప్రభుత్వం మీద విషమూ, బురదా చిమ్మే వ్యవహారాలు చాలానే ఉంటాయి. ఈలోగానే.. ఇలాంటి తోరణాల రగడలు ఇంకా ఎన్నెన్ని డ్రామాలు నడిపిస్తారో చూడాలి.