అకీరా…జనసేనాని , పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రేణు దేశాయ్ దంపతుల తనయుడు. అకీరా బుధవారం తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన తమ్ముడు పవన్‌కల్యాణ్ కుమారుడైన అకీరా పుట్టిన రోజును గుర్తు పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అకీరాతో పాటు బుధవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యువ హీరో అఖిల్ కూడా పుట్టిన రోజు ను పురస్కరించుకుని చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
మరీ ముఖ్యంగా అకీరాకు ట్విటర్ వేదికగా పెదనాన్ని చిరంజీవి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు.
`మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6'4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలి. విష్ యూ ఏ `పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా` అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
అకీరా చిన్నప్పటి ఫొటోను చిరంజీవి పోస్ట్ చేయడంతో పాటు హృదయాన్ని కదిలించేలా శుభాకాంక్షలు తెలిపారు. కానీ కుమారుడికి తండ్రి పవన్ శుభాకాంక్షలు తెలిపినట్టు ఎక్కడా సమాచారం లేదు. పవన్ ఏ చిన్న పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయనకున్న అభిమాన సైన్యం అలాంటిది. అకీరాకు పెదనాన్న శుభాకాంక్షలు సరే….నాన్న నుంచి ఆశీస్సులు ఏవీ అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవును కదా, పవన్ ఏం చేస్తున్నట్టో?