చిన్న సినిమాలు వస్తే పెద్ద బయ్యర్లు కొంటారో కొనరో అన్నది ఓ సమస్య. అదే సమయంలో చిన్న బయ్యర్లకు విక్రయిస్తే కొసవరకు మాట మీద వుంటారో వుండరో అన్నది మరో సమస్య.
పెద్ద బయ్యర్ల వత్తిడి..పెద్ద సినిమాల తాకిడికి..ఫైనాన్సియల్ కమిట్ మెంట్ కు చిన్న బయ్యర్లు నిలబడలేకపోతున్నారు. దాంతో సినిమాలను లాస్ట్ మినిట్ లో తీసుకువెళ్లి పెద్ద బయ్యర్ల దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు పెట్టాల్సి వస్తోంది. గమ్మత్తేమింటంటే ఇదంతా పెద్ద బయ్యర్లు తెరవెనుక సాగించే వ్యూహ రచన అని కూడా గుసగుసలు వున్నాయి.
లెటెస్ట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాను వరంగల్ శ్రీను నైజాం ఏరియాకు కొన్నారు. ఆ బ్యానర్ సినిమాలు అన్నీ ఆయనే చేస్తున్నారు. కానీ మరి ఎందుకు లాస్ట్ మినిట్ లో ఈ సినిమా విషయంలో డ్రాప్ అయ్యారు. ఇప్పుడు తీసుకెళ్లి ఆసియన్ సునీల్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు వుంచారు.
కార్తికేయ 2 సినిమాను ఓ చిన్న బయ్యర్ హోల్ సేల్ గా కొన్నారు. డేట్ మారినా ఆగస్టు 12న అంటే తనకు ఓకె అన్నారు. కానీ లాస్ట్ మినిట్ లో తేడా జరిగిపోయింది.
అదే బయ్యర్ హీరో నితిన్ తో సినిమా నిర్మించాలనుకుంటున్నారు. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12న వుంది. అక్కడ మొహమాటం..హెచ్చరికలు ఎదురయ్యయాని తెలుస్తోంది. దాంతో తనకు వద్దు అంటూ లాస్ట్ మినిట్ లో వదిలేసారు. దాంతో ఏరియాల వారీ విడదీసి అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ మళ్లీ నైజాం దగ్గరకు వచ్చే సరికి సమస్యే.
ఇదే పరిస్థితి చాలా చిన్న సినిమాలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నైజాంలో బయర్లు తగ్గిపోవడం వల్ల…థియేటర్లు అన్నీ ఎక్కువగా కొందరి దగ్గరే వుండిపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.