ఎందుకు?ఎందుకు?… ప్ర‌శ్న‌ల‌ వెల్లువ‌

ఒకే ఒక్క ప్ర‌శ్న‌…. సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుడానికి కార‌ణ‌మైంది. ఇంత‌కూ ఆ ప్ర‌శ్న ఏంట‌ని అడ‌గొద్దు. ఎందుకంటే తెలియ‌ని సంగ‌తైతే దాని గురించి మాట్లాడుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఎందుకు? అనే…

ఒకే ఒక్క ప్ర‌శ్న‌…. సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుడానికి కార‌ణ‌మైంది. ఇంత‌కూ ఆ ప్ర‌శ్న ఏంట‌ని అడ‌గొద్దు. ఎందుకంటే తెలియ‌ని సంగ‌తైతే దాని గురించి మాట్లాడుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఎందుకు? అనే ప్ర‌శ్న షేక్ చేస్తోంది. 

సునామీలా సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్ర‌శ్న‌ల గురించి మాత్ర‌మే మాట్లాడుకుందాం. నిగ్గ‌దీసి అడుగుతున్న నెటిజ‌న్ల సృజ‌నాత్మ‌క చైత‌న్యం గురించి తెలుసుకుందాం. దీపావ‌ళి నాడు పేలే ట‌పాసుల్లా, వంకాయి బాంబుల్లా…సోష‌ల్ మీడియాలో ఢాంఢాం అని పేలుతున్న ప్ర‌శ్న‌ల బాంబులేంటో తెలుసుకుందాం

చంద్రబాబు ఉండగా ముఖ్య‌మంత్రి జగన్ ఎందుకు? టీడీపీ ఉండగా వైసీపీ ఎందుకు? లోకేశ్ ఉండ‌గా కేఏ పాల్ ఎందుకు? హెరిటేజ్ ఉండగా అమూల్ ఎందుకు? పట్టిసీమ ఉండగా పోలవరం ఎందుకు? చంద్రన్న రెయిన్ గన్‌లుంగా…ఇక వర్షాలు ఎందుకు? నారాయణ, చైతన్య స్కూల్స్ ఉండగా…ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు? 

వెన్నుపోటు పొడిచే వాడు ఉండగా …ఇంకా ఎన్టీఆర్ కుటుంబం ఎందుకు ?  మింగ‌డానికి ప్యాకేజీ ఉండ‌గా…ప్ర‌త్యేక హోదా ఎందుకు? భ‌మ‌రావ‌తి ఉండ‌గా…విశాఖ ప‌రిపాల‌న రాజధాని ఎందుకు?  రియ‌ల్ ఎస్టేట్ ఉండ‌గా… ఫోర్త్ ఎస్టేట్ ఎందుకు?  కోవ్యాగ్జిన్ ఉండ‌గా …కోవిషీల్డ్ ఎందుకు? 

బాబు ఫిరాయింపులుండ‌గా …ప్ర‌జాస్వామ్యం ఎందుకు? రమేష్ హాస్పిటల్ ఉండగా …ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు ? ఈనాడు , ఆంధ్రజ్యోతి ఉండగా సాక్షి ఎందుకు ? జన్మభూమి కమిటీలు ఉండగా..ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ? చంద్ర‌బాబు ఉండ‌గా…ఎన్నిక‌లు ఎందుకు?…ఇలా అనేక ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.

ఈ ప్ర‌శ్న‌లు ఇప్పుడే ఎందుకు సోష‌ల్ మీడియాలో చొచ్చుకొచ్చాయ‌నే ప్ర‌శ్న అన‌వ‌స‌రం. ఏదీ కార‌ణం లేకుండా పుట్టుకురాదు. ఇప్పుడిలాంటి అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కావాలి. స‌మాధానాలు వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌శ్న‌లు ఘోషిస్తూనే ఉంటాయి. కావున స‌మాధానం తెలిసిన మ‌హానుభావాలు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంది.