పుష్ప సినిమా 2022లో తప్ప, ఆలోగా వచ్చే చాన్సే లేదు. కానీ బాహుబలి పార్ట్ వన్, టూ మాదిరిగా పుష్ప వన్, పుష్ప 2 వరుసగా విడుదల కావు అన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే నిర్మాత, బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ, పుష్ప వన్, పుష్ప 2 కి నడుమ బన్నీ వేరే సినిమా చేస్తారు అని చెప్పేసారు.
మరి హీరో బన్నీ అలా చేస్తే, డైరక్టర్ సుకుమార్ కూడా అదే బాటలో వెళ్లాల్సి వుంటుంది. పైగా సింగిల్ పేమెంట్ తో బన్నీ సన్నిహితుడు కేదార్ కు ఓ సినిమా చేయడానికి సుకుమార్ అగ్రిమెంట్ చేసుకున్నారు కూడా.
అంటే 2022 సంక్రాంతి కో, సమ్మర్ కో పుష్ప వస్తే, 2023 చివరికో, 2024 కో పుష్ప 2 వస్తుందన్నమాట. అది కూడా మధ్యలో త్రివిక్రమ్ వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇవ్వకపోతే. మహేష్ సినిమా తరువాత మళ్లీ బన్నీతో తివిక్రమ్ సినిమా వుంటుందని వార్తలు వున్నాయి కదా?