టాలీవుడ్ లో సినిమాల ప్లానింగ్ ఎంత ఫాస్ట్ గా వుంటోందో, మధ్యలోనో, ప్రీ ప్రొడక్షన్ దశలోనో పక్కన పెట్టడం కూడా అలాగే వుంది. అనుకున్న స్క్రిప్ట్ వేరు, వస్తున్న ప్రొడక్ట్ వేరు అనో, క్రియేటివ్ డిఫరెన్స్ లు అనో, ఇలా రకరకాల రీజన్స్ తో సినిమాల వ్యవహారం అబేయన్స్ లో పడుతోంది. మళ్లీ పట్టాలు ఎక్కితే ఎక్కినట్లు లేదంటే లేదు.
నాగ్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది.కానీ స్క్రిప్ట్ విషయంలో హీరో నాగ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆగిందని టాక్.
రాజశేఖర్-వెంకటేష్ మహా కాంబినేషన్ ఒక ప్రాజెక్టు ప్లానింగ్ లో వుంది.అది కూడా క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తేజ డైరక్టర్ గా ఓ పలువురు కొత్త హీరోల చుట్టూ తిరుగుతోంది. ఆఖరికి అది ఎక్కడ ఆగుతుందో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు
తరుణ్ భాస్కర్ తో సురేష్ ప్రొడక్షన్స్ ఓ సినిమా నిర్మిస్తున్నది చిరకాలంగా వినిపిస్తున్న వార్త. అది ఎప్పుడు అన్నది తెలియడం లేదు. పోనీ తరుణ్ వేరే బ్యానర్ లో చేస్తారా? అన్నదీ క్లారిటీ లేదు.
అవసరాల శ్రీనివాస్ అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఓ సిన్మా ప్లాన్ చేసారు. నాగశౌర్య హీరో. అది కొంత వరకు షూట్ జరిగి ఆగింది. కరోనా వల్ల అమెరికా వెళ్లడం కనిపించడం లేదు. సినిమా స్టార్ట్ కావడం కనిపించడం లేదు.
బెల్లంకొండ గణేష్ హీరోగా స్టార్ట్ అయిన తొలిసినిమా ఎక్కడ ఆగిందో, దాని పరస్థితి ఏమిటో కూడా తెలియదు. పవన్ సాధినేని దర్శకుడు. వివేక్ ఆత్రేయ మాటలు. కానీ ప్రాజెక్టు ఆగిపోయింది. గణేష్ ఇప్పుడు సితార సంస్థలో ఓ సినిమా స్టార్ట్ చేసాడు.
ఇలా చాలా సినిమాలు చకచకా స్టార్ట్ అవుతున్నాయి. లేదా ప్లాన్ చేస్తున్నారు.కానీ చటుక్కున ఆగిపోతున్నాయి.