మారుతి..మెగాస్టార్ సినిమా..డవుటే

ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం టాలీవుడ్ లో ఇట్టే జరిగిపోతుంది. హిట్ ట్రాక్ లో వుంటే అంతా వెంట పడతారు. లేదంటే మొహం చాటేస్తారు.  Advertisement పక్కా కమర్షియల్ విడుదల టైమ్…

ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం టాలీవుడ్ లో ఇట్టే జరిగిపోతుంది. హిట్ ట్రాక్ లో వుంటే అంతా వెంట పడతారు. లేదంటే మొహం చాటేస్తారు. 

పక్కా కమర్షియల్ విడుదల టైమ్ లో దర్శకుడు మారుతితో సినిమా చేసే విషయాన్ని మెగాస్టార్ నే స్వయంగా వెల్లడించారు. రామ్ చరణ్ స్నేహితుడు విక్రమ్ (యువి) నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని ఆయనే అన్నారు. కానీ ఇప్పుడు వ్యవహారం వేరుగా మారుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ఓ సినిమాను శంకర్ డైరక్షన్ లో చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువి నిర్మించే సినిమా స్టార్ట్ చేస్తారు. యువి సంస్థకు ఎలాగూ ఒక సినిమా చేస్తున్నారు కనుక మళ్లీ వెంటనే తను కూడా అదే సంస్థకు సినిమా చేసే ఆలోచనలో మెగాస్టార్ లేరని తెలుస్తోంది. మారుతి కనుక మరీ అద్భుతమైన కథ చెబితే అప్పుడు చూడవచ్చు అనే భావనలో మెగాస్టార్ వున్నారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఆచార్య తరువాత తనను జనం ఎలాంటి సినిమాల్లో చూస్తారన్నది క్లారిటీ రావాల్సి వుందని మెగాస్టార్ భావిస్తున్నారు. అందుకే చేతిలో వున్న మూడు సినిమాలు పూర్తి చేసే వరకు మరే సినిమా అంగీకరించకూడదనే ఆలోచనలో వున్నారట. ఈ మూడు సినిమాలు విడుదల కావాలంటే 2023 సమ్మర్ దాటాల్సిందే.

అంటే ఇప్పుడు మారుతి కనుక మెగాస్టార్ సినిమా కావాలి అంటే అంత అద్భుతమైన కథ తయారుచేసుకోవాల్సి వుంటుంది. కాన్సెప్ట్ మాత్రం అనుకుంటే సరిపోదు. అందువల్ల ప్రభాస్ సినిమా ఒక్కటే మారుతికి మిగిలిన ఆశ.