కరోనాపై పోరు.. జగన్ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన సమయాన్ని పూర్తిగా కరోనా నిరోధానికే కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశనం చేస్తున్న ముఖ్యమంత్రి.. తాజాగా…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన సమయాన్ని పూర్తిగా కరోనా నిరోధానికే కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశనం చేస్తున్న ముఖ్యమంత్రి.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్న వ్యక్తికి చికిత్స అందిస్తే 10,774 రూపాయలు తక్షణం చెల్లిస్తారు. దీంతో పాటు ఆ చికిత్స చేసిన వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ కింద మరో 5631 రూపాయల్ని చెల్లిస్తారు. అలా మొత్తంగా కరోనా వైద్యానికి 16,405 రూపాయల్ని ఆస్పత్రులకు చెల్లించేలా ఆరోగ్యశ్రీకి వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇక కరోనా పాజిటివ్ అని తేలిన కేసులకు 65వేల రూపాయల నుంచి 2 లక్షల 15వేల వరకు ప్యాకేజీ వర్తించేలా నిబంధనలు రూపొందించారు.

అటు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం ప్రభుత్వానికి ఊరట కలిగించింది. గుంటూరు జిల్లాలో మాత్రం ఒక పాజిటివ్ తేలింది. దీంతో ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 304కు చేరింది.

అటు కర్నూల్ లో కరోనా కారణంగా ఓ వ్యక్తి మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల పేషెంట్ 1వ తేదీన హాస్పిటల్ లో చేరారని, పాజిటివ్ గా నిర్థారించిన ఈ పేషెంట్ కు ఇప్పటికే టైప్-2 డయాబెటిస్ ఉందని, 3వ తేదీన మరణించిన ఈ పేషెంట్ కు ఎలాంటి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేదని ప్రభుత్వం నిర్థారించింది.

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను