కరోనా మరణాల్లో ఎక్కువ మంది 60-65 ఏళ్లు పైబడిన వ్యక్తులే ఉంటున్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ 82 ఏళ్ల ఓ వృద్ధుడు కరోనా నుంచి బయటపడ్డాడంటే కచ్చితంగా అది విశేషమే. అలాంటి విశేషమే ఢిల్లీలో చోటుచేసుకుంది. 82 ఏళ్ల మన్మోహన్ సింగ్, కరోనా నుంచి బయటపడ్డాడు.
గత నెల 30న ఢిల్లీకి చెందిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి కరోనా లక్షణాలతో లోకల్ గా ఉన్న ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలడంతో వెంటనే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి చికిత్స ప్రారంభించారు. వైద్యులు ఇచ్చిన మందులకు మన్మోహన్ సింగ్ శరీరం శరీరం తట్టుకుంది.
82 ఏళ్ల వయసులో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు, ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోవడం వల్ల పూర్తిగా కోలుకున్నారు మన్మోహన్ సింగ్. ఆయనకు వరుసగా మూడోసారి కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ అని నిర్థారించుకున్న తర్వాత ఈరోజు డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421 గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 114 మంది మృత్యువాత పడ్డారు. రేపటికి దాదాపు లక్షకు పైగా కరోనా కిట్స్ అందుబాటులోకి వస్తాయని, దీంతో మరింత వేగంగా కరోనా నిర్థారణ పరీక్షలు చేయడం వీలవుతుందని ప్రకటించింది ప్రభుత్వం.