బాలీవుడ్ కూడా పట్టాలెక్కింది

నిన్నట్నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మెల్లమెల్లగా సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. షూటింగ్స్ కు అనుమతిచ్చిన మొదటిరోజే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి…

నిన్నట్నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మెల్లమెల్లగా సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. షూటింగ్స్ కు అనుమతిచ్చిన మొదటిరోజే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు సెట్స్ పైకి రావడం విశేషం.

తన కొత్త సినిమా షూటింగ్ కోసం అమితాబ్ లొకేషన్ కు వచ్చారు. సెకెండ్ వేవ్ తర్వాత అన్-లాక్ లో భాగంగా ఫస్ట్ టైమ్ లొకేషన్ లో అడుగుపెడుతున్నానంటూ ప్రకటించిన బిగ్ బి, పరిస్థితులు రోజురోజుకు మెరుగవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మాస్క్ తో దిగిన స్టైలిష్ ఫొటోను కూడా రిలీజ్ చేశారు అమితాబ్.

అటు మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా షూటింగ్ స్టార్ట్ చేశాడు. ముంబయిలోని ఓ స్టుడియోలో లాల్ సింగ్ చద్దా కొత్త షెడ్యూల్ మొదలైంది. అయితే ఇది భారీ షెడ్యూల్ కాదు, ఈ వారాంతానికి ఈ షెడ్యూల్ ముగిసిపోతుందని యూనిట్ తెలిపింది.

అటు అక్షయ్ కుమార్, భూమి పడ్నేకర్ లాంటి తారలు కూడా తమ కొత్త సినిమాలు స్టార్ట్ చేశారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ ను రేపట్నుంచి స్టార్ట్ చేయబోతోంది అలియాభట్. మరోవైపు కత్రినాకైఫ్, దీపిక పదుకోన్ కొత్త యాడ్స్ కు సంబంధించి షూటింగ్స్ మొదలుపెట్టారు.