కల్కి థియేటర్ రైట్స్ @ 12 కోట్లు

హీరో రాజశేఖర్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా టీజర్ ఇటీవల విడదలయింది. దాంతో సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది. దీంతో ఈ సినిమా వరల్డ్  వైడ్ థియేటర్ రైట్స్ కు…

హీరో రాజశేఖర్ చేస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా టీజర్ ఇటీవల విడదలయింది. దాంతో సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది. దీంతో ఈ సినిమా వరల్డ్  వైడ్ థియేటర్ రైట్స్ కు మాంచి బేరాలు వచ్చేసాయి.

12 కోట్లకు దాదాపు బేరం ఫైనల్ అయిపోయింది. నిర్మాత రాధా మోహన్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమా మీద తమిళ క్రేజీ హీరో ధనుష్ కూడా ఆసక్తిగా వుండడం. ఆయన  ఈ సినిమాతో తెలుగు మార్కెట్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.

ఆయన తన వండర్ బార్ సంస్థను టాలీవుడ్ లో కూడా విస్తరించాలనుకుంటారు. అందుకే ఆయన కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆయన తన వండర్ బార్ సంస్థ కోసం ఈ సినిమా ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ కావాలని అడుగుతున్నట్లు బోగట్టా. అయితే ఇప్పటికే రాధామోహన్ కు అగ్రిమెంట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వరల్డ్ వైడ్ గా పన్నెండు కోట్లు అంటే తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల బిజినెస్ చేయాల్సి వుంటుంది.