Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇంద్రగంటి-నాని సినిమాకు వెరైటీ టైటిల్

ఇంద్రగంటి-నాని సినిమాకు వెరైటీ టైటిల్

ఇంద్రగంటి-నాని-సుధీర్ బాబు సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ పెట్టినట్లు గతంలో గ్యాసిప్ లు వచ్చాయి. కానీ అది కాదని, అసలు ఆ టైటిల్ ఆలోచనలోనే లేదని తెలుస్తోంది. ఇంద్రగంటి తన సినిమాలకు అత్యంత లలితమైన పేర్లు పెడుతుంటారు.

అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తరువాత, సమ్మోహనం, ఇలా.. ఇలా.. ఇప్పుడు నాని-సుధీర్ బాబు సినిమాకు కూడా ఇలాంటి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు బోగట్టా. ఈ టైటిల్ లో ఒకటి రెండురోజుల్లో లోగో కార్డ్ తో విడుదల చేసే ఆలోచనలో వున్నారు నిర్మాత దిల్ రాజు.

ఈ టైటిల్ ను ఇప్పుడే లీక్ చేస్తే, రిజిస్ట్రేషన్ వగైరా సమస్యలు వస్తాయని, పైగా ఆ కిక్ పోతుందని, అదే ఒకేసారి లోగో ప్లస్ లుక్ తో విడుదల చేస్తే బాగుంటుందని యూనిట్ అభిప్రాయం. అందువల్ల లీక్ చేయడం లేదు. అయితే టైటిల్ మాత్రం కచ్చితంగా కాస్సేపు మాట్లాడుకునేలా వుంటుందని తెలుస్తోంది.

నాని కూడా తన సినిమాలకు మంచి టైటిళ్లు వుండేలాచూస్తుంటారు. ఎవడే సుబ్రహ్మణ్యం, అ, జెర్సీ, లాంటి భిన్నమైన టైటిళ్లు నాని ఖాతాలో వున్నాయి. ఇప్పుడు వచ్చే టైటిల్ కచ్చితంగా వాటి సరసన వుంటుంది.

రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

జెర్సీ గురించి నాని చెప్పిన నిజాలేంటి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?