మా అధ్యక్షుడిగా వివాదాలకు గురయ్యారు సీనియర్ నటుడు నరేష్. సినిమా పెద్దలంతా చాలా వెల్ ప్లాన్డ్ గా ఆయనను పక్కకు తప్పించారు. సెలవు అనే సాకుతో మా పగ్గాలు ఆయన నుంచి తీసుకున్నారు. సరే అదంతా వేరే సంగతి.
కానీ కరోనా కల్లోలం వేళ నరేష్ మంచి ప్లానింగ్ తో తోటి నటులను ఆదుకున్నారు. తెలుగు నటుల సంఘం మా లో ఎంతో మంది పేదవారు వున్నారు. నెల నెల మా నుంచి పింఛను అందుకుంటున్నవారు వున్నారు. వీరికి నేరుగా నగదు సాయం ప్రకటించారు నరేష్.
వంద మంది పేద నటులకు 10 వేల వంతున వారి అక్కౌంట్లలో వేస్తున్నానని ప్రకటించారు. ఇప్పటికే 58 మందిని గుర్తించి, సాయం అందించామని అన్నారు. నిజానికి ఇది చెప్పుకోదగ్గ సాయమే. సిసిసి సినిమా కార్మికులకు సామాన్లు అందిస్తోంది. అది మహా అయితే మూడు వేలు అవుతుంది. నరేష్ పదివేలు ఇవ్వడం అంటే మూడు నెలల పాటు సాయం ముందుగానే అందిస్తున్నట్లు అన్నమాట.
ఈసాయానికి అదనంగా నరేష్ మరో లక్ష రూపాయలు సిసిసి కి కూడా అందించారు. నిజానికి ఇలా ఏ సంఘానికి ఆ సంఘంలో వున్న కలిగిన వారు, ఈ విధంగా అందిస్తే బాగుంటుంది.