క‌రోనా వేళ‌.. దేశంలో చిత్ర‌మైన గొడ‌వ‌లు!

-క్వారెంటైన్ వేళ ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్నా వెళ్లాడ‌ని, బ‌య‌ట తిరిగి ఇంటికి వ‌చ్చిన త‌మ్ముడిని చంపిన అన్న‌!-ఇది ముంబైలో జ‌రిగింది. Advertisement -ప‌శ్చిమ‌బెంగాల్ లో క్వారెంటైన్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌డం గురించి రెండు…

-క్వారెంటైన్ వేళ ఇంట్లోంచి బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్నా వెళ్లాడ‌ని, బ‌య‌ట తిరిగి ఇంటికి వ‌చ్చిన త‌మ్ముడిని చంపిన అన్న‌!-ఇది ముంబైలో జ‌రిగింది.

-ప‌శ్చిమ‌బెంగాల్ లో క్వారెంటైన్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌డం గురించి రెండు ఊళ్ల మ‌ధ్య త‌గాదా జ‌రిగింది. అది త‌మ ఊరికి దూరంగా ఉండాల‌ని.. ఇరు గ్రామాల వాళ్లూ ర‌చ్చ మొద‌లుపెట్టారు. కొట్టుకున్నారు ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మ‌ర‌ణించారు.

-ఎక్క‌డో బెంగాల్ వ‌ర‌కూ ఎందుకు.. ఏపీలో కూడా ఇలాంటి ర‌చ్చ‌లు జ‌రుగుతున్నాయి. విజ‌య‌వాడ‌లో క‌రోనా విష‌యంలో ఆసుప‌త్రి ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తే దాన్ని ఆ న‌గ‌రం ఎంపీ వ్య‌తిరేకిస్తూ ట్వీట్ చేశాడు. రాజ‌ధాని అయితే కావాలి, ఆసుప‌త్రి మాత్రం అక్క‌డొద్దు! ఇదీ వీళ్ల నికృష్ట స్వ‌భావం.

-ఇక సామాన్య జ‌నాల తీరూ మార‌డం లేదు. చ‌ర్చిల్లో నిన్న ఆదివారం కూడా కొన్ని చోట్ల సామూహిక ప్రార్థ‌న‌లు చూశార‌ట‌. వీళ్ల మీద హ‌త్యాయ‌త్నం కేసులు పెట్టినా త‌ప్పు లేదు. ఇక మ‌రి కొన్ని ప‌ల్లెల్లో క‌రోనా వైర‌స్ విరుగుడుగా బోనాలు స‌మ‌ర్పించే ప్లాన్లు వేస్తున్నారు. వీళ్ల‌నేం అనాలో అర్థం కాదు!

-మ‌రోవైపు త‌బ్లిగీ వ్య‌వ‌హారంతో ఇస్లామోఫోబియా అల్లుకుంటోంది. ఈ సంద‌ర్భంలో ముస్లింలే ముందుకు రావాలి. త‌బ్లిగీ యావ‌త్ ముస్లింల‌కూ రెప్ర‌జెంటేటివ్ కాద‌ని వాళ్లు చెప్పాలి. ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిన వాళ్ల‌ను గుర్తించి ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇవ్వాలి. అలా కాకుండా.. ఇంకా మ‌త సంప్ర‌దాయాల‌నూ స‌మ‌ర్థించుకుంటూ ఉంటే న‌ష్ట‌పోయేది ఎవ‌రు?

-త‌మిళ‌నాడులో ఒక‌డు క‌రోనా అంతా ప్ర‌భుత్వ క‌ల్ప‌న అని, ఒక మ‌తం వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌లకే ఇలాంటి ప‌నులు చేస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. వాడిని అరెస్టు చేశారు పోలీసులు.

-క‌రోనా వేళ గుమికూడ‌టం వ‌ద్దని ఇంత‌గా మొత్తుకుంటుంటే, మ‌హారాష్ట్ర‌లో ఒక బీజేపీ ఎమ్మెల్యే తన దాతృత్వాన్ని చాటుకోవ‌డానికి ఉచితంగా రేష‌న్ పంచుతున్నాడ‌ట‌. దీని కోసమ‌ని ప్ర‌జ‌లు అత‌డి ఇంటి వ‌ద్ద‌ గుంపులుగుంపులుగా ఏర్ప‌డుతున్నారు.

-యూపీలో మ‌రో దుర్మార్గం. దేశంలో క‌రోనా వ్యాపించ‌డానికి కార‌ణం అంటూ ఆ ఊర్లోని త‌బ్లిగీ గ్యాంగ్ ను ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చి తిట్టాడ‌ట ఒక వ్య‌క్తి. ఆ ఊర్లో త‌బ్లిగీ ఫాలోయ‌ర్ల‌ను అత‌డు నిందించాడు. కాసేప‌టికే ఇద్ద‌రు బైక్ మీద వ‌చ్చి ఆ వ్య‌క్తిని కాల్చి చంపారు! 

ఒక‌వైపు క‌రోనా గురించి ప్ర‌పంచ మొత్తం ఆందోళ‌న చెందుతూ ఉంటే, లాక్ డౌన్ పాటిస్తూ ఒక వైపు ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలుస్తున్న ఇండియాలో, ఇలాంటి సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతున్నాయి.

మనమంతా ఒక్కటే అని చాటుదాం