ప్ర‌ధాన‌మంత్రి గ‌ర్ల్ ఫ్రెండ్ కూ క‌రోనా భ‌యం!

ఏడు రోజుల పాటు క్వారెంటైన్ లో ఉన్న బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ కు క‌రోనా ల‌క్ష‌ణాలు కొన‌సాగుతూ ఉన్నాయ‌ట‌. ఆయ‌న‌కు టెంప‌రేచ‌ర్ త‌గ్గుముఖం ప‌ట్ట‌లేద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు వైద్యం కొన‌సాగ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది.…

ఏడు రోజుల పాటు క్వారెంటైన్ లో ఉన్న బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ కు క‌రోనా ల‌క్ష‌ణాలు కొన‌సాగుతూ ఉన్నాయ‌ట‌. ఆయ‌న‌కు టెంప‌రేచ‌ర్ త‌గ్గుముఖం ప‌ట్ట‌లేద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు వైద్యం కొన‌సాగ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇది వ‌ర‌కూ వివిధ దేశాల్లో పాల‌కులే క‌రోనా బారిన ప‌డ‌గా వారిలో కొంద‌రు కోలుకున్నారు. ప్ర‌ముఖుల‌కు ఎలాగూ మంచి వైద్య స‌దుపాయాలు ఉంటాయి. ఈ నేప‌థ్యంలో వారు ఈజీగా కోలుకోవ‌చ్చు. అయితే బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి మాత్రం ఇంకా కోలుకోలేద‌ట‌.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్ కూడా త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఆమె ప్రెగ్నెంట్ కూడా. కేరీ సైమండ్స్ అనే మ‌హిళ‌తో బోరిస్ జాన్స‌న్ స‌హ‌జీవ‌నంలో ఉన్నట్టున్నాడు. వీరిద్ద‌రూ త‌మ బంధాన్ని ధ్రువీక‌రించారు ఎప్పుడో. ఈ క్ర‌మంలో ఆమె ప్రెగ్నెంట్ కూడాన‌ట‌.

వారం ప‌ది రోజుల కింద‌ట త‌ను జాన్స‌న్ తో బెడ్ ను పంచుకున్న‌ట్టుగా ఆమె తెలిపింది. ఈ నేప‌థ్యంలో త‌న‌లో కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆమె ప్ర‌క‌టించింది. త‌ను ప్రెగ్నెంట్ కూడా కావడంతో.. ఇప్పుడు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తూ ఉండ‌టం మ‌రింత ఆందోళ‌న‌క‌ర‌మైన అంశం అని ఆమె అభిప్రాయ‌ప‌డింది.

మనమంతా ఒక్కటే అని చాటుదాం