అఫైర్ అనే ఇంగ్లిష్ పదం చాలా పాపులర్. అఫైర్ అనే పదం ఏకవచనం అయితే అఫైర్స్ అనే పదం బహువచనం. అంటే ప్లూరల్ అన్నమాట. ఉదాహరణకు …ఎక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అని అర్థం.
అంతేతప్ప అతనికేవో బయటి వ్యక్తులతో ఉండకూడని సంబంధాలు ఉన్నాయని అర్థం కాదు కదా. ఎఫైర్ అంటే ఓ వ్యవహారం. ఆ వ్యవహారానికి అవసరమైన సంబంధం. కానీ సినిమా రంగంలో అఫైర్ అంటే ఒక్కటే అర్ధం. అదే అక్రమ సంబంధం. సినిమా రంగంలో నటీ నటుల మధ్య బోలెడు అఫైర్లు చెక్కర్లు కొడుతుంటాయి.
ఫలానా నటికి నటుడికి లేదా హీరోకు హీరోయిన్ కు మధ్య సంబంధం ఉండనే పుకార్లు ప్రతిరోజూ వినబడతాయి. ఓ హీరో, ఓ హీరోయిన్ కలిసి ఎక్కువ సినిమాల్లో నటిస్తే చాలు కొంతకాలం తరువాత వారి ఇద్దరి మధ్య అఫైర్ ఉందని వార్తలు వస్తుంటాయి. సినిమా పరిభాషలో అఫైర్ అంటే మరో అర్థం లేదు. అక్రమ సంబంధమే.
ఇద్దరి మధ్య అఫైర్ ఉందని ప్రచారమైతే చాలు అది జీవితాంతం అలా కొనసాగుతూనే ఉంటుంది. మీడియాలో ఆ హీరో లేదా హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కోసారి అఫైర్ గురించి కూడా అడిగి ఇబ్బంది పెడుతుంటారు. ఇంటర్వ్యూల్లో ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు కొందరు కోప్పడతారు, కొందరు నో కామెంట్ అని ఊరుకుంటారు. కొందరు క్లాస్ పీకుతారు.
కానీ వెటరన్ హీరో, కొంతకాలంగా విలన్ పాత్రలు అద్భుతంగా పోషిస్తున్న జగపతిబాబును తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివంగత హీరోయిన్ సౌందర్యంతో అఫైర్ గురించి అడిగారు. సౌందర్య మరణించి చాలా ఏళ్ళైనా ఇప్పటికీ వారిద్దరి మధ్య అఫైర్ ఉందనే నమ్మకం సినిమా పరిశ్రమలో సజీవంగానే ఉంది.
జగపతిబాబు వయసు మీరిపోయి విలన్ వేషాలు వేస్తున్నాఇంటర్వ్యూలో ఈ ప్రశ్న వేశారంటే ఏమనుకోవాలి ? అయినప్పటికీ జగపతిబాబు సమాధానం చెప్పాడు.
అవును… సౌందర్యంతో నాకు అఫైర్ ఉండేది. ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్. అందుకే వారి ఇంటికి వెళ్ళేవాడిని. సౌందర్య మా ఇంటికి తరచుగా వచ్చేది. ఆమె గురించి తప్పుగా అనుకునేవారు. కానీ సౌందర్య అలాంటిది కాదు. మా బంధాన్ని ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్ధం చేసుకునేవారు. మా బంధం గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని కాంప్లిమెంటుగా తీసుకుంటాను. ఆ విషయంలో నేను దాయాల్సింది ఏమీ లేదు. అందరి దృష్టిలో అఫైర్ అంటే లైంగిక సంబంధం కలిగిఉండటమని ఆలోచిస్తారు. కానీ నేను సౌందర్య మంచి అనుబంధం కలిగివుండేవాళ్ళం. అదే ఆమెతో నాకున్న అఫైర్ .. అని చెప్పాడు జగపతి బాబు.
వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.