సిక్స్ ఫ్యాక్ అన్నది ఓ వేలాం వెర్రి. అయినా అది ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయింది. కాస్త ఫిట్ నెస్ వుండి, చూడ్డానికి చక్కగా వుండే బాడీ వుంటే చాలు. అసలు సిక్స్ ఫ్యాక్ కోసం ట్రయ్ చేసి, మొహాలు చెక్క పేడుల్లా అందరహితంగా మార్చేసుకున్న హీరోలు కూడా మనకు వున్నారు. ఆది సాయి కుమార్ కు కేవలం సిక్స్ ఫ్యాక్ వల్లే ఫేస్ మారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ వేలాం వెర్రిలో చివరాఖరున చేరారు హీరో నిఖిల్. ఈ మధ్యన నిఖిల్ కాస్త అటెన్షన్ డ్రా చేయడానికి చాలా కష్టపడతున్నారు. సోషల్ మీడియాలో వీలయినంత యాక్టివ్ గా వుండాలనుకుంటున్నారు. ఏదో విధంగా జనాల దృష్టిలో వుండాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇఫ్పట్లో సినిమాలు లేవు. గీతా సినిమా, కార్తికేయ 2 కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు తక్కువ.
గీతా సంస్థ అఖిల్ సినిమా, వరుణ్ తేజ్ సినిమాలు పూర్తి చేయాలి. ఆవి రెండూ ఫస్ట్ ప్రయారిటీ. ఆ తరువాత నిఖిల్ సినిమా, కార్తికేయ గుమ్మకొండ సినిమాలు. కరోనా వల్ల పరిస్థితులు అన్నీ మారిపోయాయి. కార్తికేయ 2 తీయాల్సిన పీపుల్స్ మీడియా సంస్థ కూడా చాలా కమిట్ మెంట్లు పూర్తి చేయాలి. పైగా అమెరికాలోనే అనేక వ్యాపారాలు వున్న ఆ సంస్థ అధినేత విశ్వప్రసాద్ అన్నీ సెట్ చేసుకోవాలి.
ఇలాంటి నేపథ్యంలో సిక్స్ ప్యాక్ ఇంట్లోనే, డంబుల్స్ సాయంతో చేసేస్తున్నా అంటూ నిఖిల్ ఓ పిక్ ను సోషల్ మీడియాలోకి వదిలారు. కార్తికేయ 2 సినిమాలో షర్ట్ విప్పే సీన్ వుంది అందుకోసమే సిక్స్ ప్యాక్ అనేసారు. ఒక్క షర్ట్ విప్పే సీన్ కోసం సిక్స్ ప్యాక్, దీనికి సోషల్ మీడియాలో ఫన్నింగ్ రెస్సాన్స్ వస్తోంది.
పెళ్లయ్యాక ఫ్యామిలీ ప్యాక్ నే అని, ఏ యాప్ తో ఈ పిక్ అని, ఇలా సరదాగా కామెంట్లు పడుతున్నాయి. అదే టైమ్ లో సూపర్ బాడీ అన్న ప్రశంసలు దక్కుతున్నాయి.