ట్రాన్స్ పెరెన్సీ అన్నది దేనికైనా కీలకం. అందునా కరోనా మహమ్మారి లాంటిది కమ్ముకున్న టైమ్ లో మరీనూ. ఇలాంటి టైమ్ లో ఆంధ్ర ప్రభుత్వం చాలా ట్రాన్స్ పెరెన్సీతో వ్యవహరిస్తోంది. అలాంటి నేపథ్యంలో కూడా ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేయడం అంటే కామన్ మ్యాన్ లకు కూడా కాస్త ఆశ్చర్యంగా వుంది.
జనాలు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యారు. వాట్సాప్ లో ఓ పోస్ట్ ఇలా పడితే అలా గంటలో ప్రపంచం అంతా చుట్టేస్తోంది. ఆంధ్ర నుంచి రోజుకు రెండు మూడు హెల్త్ బులిటెన్ లు వస్తున్నాయి. ప్రతి సారీ మొత్తం అన్ని వివరాలు అందిస్తున్నారు. కొత్తవి, పాతవి, అన్నీ వివరంగా తెలియచేస్తున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని అని కరోనా భాధితుల వివరాలు డిటైల్డ్ గా అందిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏ ఊరు, ఏ వీధి ఇలా ప్రతి వివరం తెలియచేస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? బాబుగారు హైదరాబాద్ లో వున్నారు. ఆయన గతంలో అనుకున్న బస్ యాత్ర ఒక్కసారి ఇప్పుడు చేస్తే, పట్టణాలు, పల్లెలు ఎంత శుభ్రంగా వున్నాయో అర్థం అవుతుంది. జనాలు వెక్కిరించే బ్లీచింగ్ ను ఎంత విరివిగా వాడి రోడ్ల పక్కలను శుభ్రంగా వుంచుతున్నారో తెలుస్తుంది.
కూరగాయలు, పళ్లు, నిత్యావసర వస్తువులు పక్కాగా అందుబాటులో వుంటున్నాయని అర్థం అవుతుంది. ఇందులో ఎవరికన్నా అనుమానం వుంటే, ఆంధ్రలో పర్యటిస్తే అర్థం అవుతుంది. అంతే కాదు, క్వారంటైన్ వార్డుల్లో రోగులకు రోజుకు 250 రూపాయల విలువైన ఫుడ్ ను అందిస్తున్నారు అనకూడదు కానీ, ఇంటికన్నా క్వారంటైన్ వార్డు మిన్న అన్నట్లు నడుపుతున్నారు.
చిత్రంగా తెలంగాణ వ్యవహారం దీనికి భిన్నంగా వుంది. నిత్యం ఓ అంకె అది కూడా రాత్రి పొద్దుపోయిన తరువాత వదులుతున్నారు. అంతకు మించి వివరాలు వుండడం లేదు. తెలంగాణలో ఇప్పుటికి 11 కరోనా మరణాల సంభవించాయి. అలాగే 272 కేసులు నమోదు అయ్యాయి. 11 మరణాలు సంభవించడం విషాదకరమే. ఆంధ్రలో 192 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కటే మరణం సంభవించింది.
ఇలాంటి టైమ్ లో పార్టీలకు అతీతంగా వుండాలి. ఆంధ్రలో ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలకు మద్దతు ఇవ్వకపోగా, ప్రతిపక్షనేతగా రాష్ట్రంలోనే వుండకుండా, ఎక్కడో వుండి విమర్శలు చేయడం చంద్రబాబకు తగునా? అధికారం వుంటేనే ఆయన ప్రజలకు దగ్గరగా వుంటారేమో?