స్త్రీ, పురుషుల పరస్పర ఆకర్షణ అత్యంత సహజమైనది. సృష్టి రహస్యమిది. అయితే ఇదే అంశంపై ఎన్నో సందేహాలు! మరి ఈ విషయంలో ఒక్కోరి ప్రాధాన్యతలు ఒక్కో రకమైనవిలా ఉండటమే అన్ని సందేహాలకూ కారణం.
ఇలాంటి నేపథ్యంలో… ఈ అంశంపై అధ్యయనాలు, పరిశోధనలు ఆసక్తిదాయకమైనవి. మనసులు విప్పితే కానీ.. ఈ అంశాలపై స్పష్టత రాదు. ఇలాంటి నేపథ్యంలో.. రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ ఈ తేనేతుట్టెను కదిలించే ప్రయత్నం చేయగా.. అందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ప్రధానంగా స్త్రీలలో పురుషుడిని ఆకట్టుకునే అంశాలివే. దీనికి ముఖ్యమైన సమాధానం.. అందం అనే అంటారెవరైనా. అందంగా ఉండే స్త్రీ పట్లే ఎక్కువమంది పురుషులు ఆకర్షితులు అవుతారు. ఇది కూడా సృష్టి సహజమే అనుకోవాలి. దాని తర్వాత… ప్రాధాన్యతలు ఏమిటంటే!
ఎలా మాట్లాడుతుంది?
ఇతరులతో స్త్రీ సంభాషించే తీరు పురుషులను బాగా ఆకట్టుకునే అంశాల్లో ఒకటి. పురుషులు బాగా పరిశీలించే అంశం కూడా ఇదే! తనతోనే కాకుండా.. వేర్వేరు వ్యక్తులతో ఆమె మాట్లాడే తీరు పురుషుడిని బాగా ప్రభావితం చేస్తుంది. ఇది అర్థవంతంగా, కాన్ఫిడెంట్ గా ఉండాలని కోరుకోవడంలో ఏ మాత్రం వింత లేదు. అహంభావపూర్వకంగా మాట్లాడే స్త్రీకి వీలైనంత దూరంగా ఉండాలని ఏ మగాడైనా కోరుకుంటాడు!
ఇంటలెక్చువల్!
తెలివైన అమ్మాయిలను అబ్బాయిలు సహించలేరు అనే అభిప్రాయాలున్నప్పటికీ.. తమ మేధస్సుతో మ్యాచ్ అయ్యే సంభాషణలు చేయగల అమ్మాయిలు మగాళ్లను ఆకట్టుకుంటారు. తెలివికీ, మేధస్సుకూ సంబంధం లేకపోవచ్చు కూడా! తెలివితేటలు వాదనల్లో చూపించడానికి పనికొస్తాయి. మేధస్సు మాత్రం అహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది సంభాషణల్లో. ఈ తరహాలో తమ తో మ్యాచ్ అయ్యే ఇంటెలిజెన్స్ మగాళ్లను మురిపిస్తాయి.
కన్సిస్టెంట్ మైండ్ సెట్!
అతిగా మూడ్ స్వింగ్స్ ను కలిగి ఉండే వాళ్లనెవరినైనా భరించడం చాలా కష్టం. ఇలాంటి వారి కన్నా మైండ్ సెట్ విషయంలో స్థిరంగా ఉండే వాళ్లు ఎవరినైనా ఆకట్టుకోగలరు. స్త్రీలకు బాగా వర్తించే విషయం ఇది.
ఎక్స్ పెరిమెంటల్!
ఇది లైంగికాసక్తికి సంబంధించిన అంశం. శృంగారంలో ఎక్స్ పెరిమెంట్స్ పట్ల ఉత్సాహం చూపే వాళ్లు, మగాడిని రంజింపజేయడాన్ని స్వతహాగా తెలిసిన వారికి మించి మగాళ్లను ఆకట్టుకునే మెటీరియల్ ఉండదు!
సెన్సాఫ్ హ్యూమర్!
ఇది మానవులను సహజంగానే ఆకట్టుకునే గుణం. ఇదే లక్షణం మగువలో ఉంటే.. ఆమె మగాడి పాలిట అయస్కాంతంగా మారడం ఖాయం!