అప్పన్న సైతం ఒంటరే!

కరోనా దెబ్బకు మానవులు దేవుళ్ళు అందరూ ఏకాంతంలోనే గడపాల్సివస్తోంది. ఎవరూ బయటకు రాని దుస్థితి. సమస్త లోకాలకు అండగా నిలిచే సింహాద్రి అప్పన్న పెళ్ళి కూడా ఎవరూ లేకుండానే జరుగుతోంది. అప్పన్న పెళ్ళికి అతిధులైన…

కరోనా దెబ్బకు మానవులు దేవుళ్ళు అందరూ ఏకాంతంలోనే గడపాల్సివస్తోంది. ఎవరూ బయటకు రాని దుస్థితి. సమస్త లోకాలకు అండగా నిలిచే సింహాద్రి అప్పన్న పెళ్ళి కూడా ఎవరూ లేకుండానే జరుగుతోంది. అప్పన్న పెళ్ళికి అతిధులైన భ‌క్తులంతా ఇపుడు ఎవరి ఇంట్లో వారు బంధీలు.

దాంతో అప్పన్న వార్షిక  తిరు కళ్యాణం సైతం గుట్టు చప్పుడు కాకుండానే జరుగుతోంది. భూదేవి అంత పీట, ఆకాశం  అంత పందిరి వేసి ప్రతీ ఏటా సింహాచలం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా  జరిపే  ఈ కళ్యాణ వేడుకలకు అటు ఒడిషా నుంచి, ఇటు ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై పెళ్ళి పెద్దలుగా వ్యవహరించేవారు.

ఇపుడు కరోనా వైరస్ మూలంగా ఆ ముచ్చట్లకు అసలు వీలులేదు. దాంతో అర్చక స్వాములే వేదోక్తంగా అప్పన్న పెళ్ళిని దగ్గరుండి జరిపిస్తున్నారు. మరి భక్తులంతా ఎవరి ఇంట్లో వారు ఉండి అప్పన్నను మనసులో తలచుకుని  మొనో నేత్రంతో ఆ పెళ్ళి వేడుకను చూసి ఆనందించాల్సిందే.

ఏది ఏమైనా భద్రాచలం రాములవారు తరువాత సిం హాద్రి అప్పన్న పెళ్ళి కూడా చడీ చప్పుడు లేకుండా ముగిసిపోవడంతో ఆస్తిక జనులు తీవ్ర  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాపించిన అరుదైన సందర్భంలో దేవ దేవుడికైనా తప్పదు ఈ తెరచాటు. భక్తులకు తప్పదు ఈ గ్రహపాటు.

'విశ్వక్' మూవీకి నాకు సంబంధం..?