బన్నీ సినిమాలు..కొత్త ఏముందీ?

బన్నీ సినిమాల లైనప్ ఇదీ అంటూ ఆయన సన్నిహితుడు బన్నీ వాస్ ఓ జాబితా వెల్లడించారు. లిస్ట్ బాగానే వుంది కానీ వీటిలో కొత్త ఏముందీ అన్నట్లుంది ఇది. బన్నీ వాస్ బర్త్ డే…

బన్నీ సినిమాల లైనప్ ఇదీ అంటూ ఆయన సన్నిహితుడు బన్నీ వాస్ ఓ జాబితా వెల్లడించారు. లిస్ట్ బాగానే వుంది కానీ వీటిలో కొత్త ఏముందీ అన్నట్లుంది ఇది. బన్నీ వాస్ బర్త్ డే కు ఆయన నిర్మాణంలో వచ్చే సినిమాలు ఏకరవు పెట్టకుండా, బన్నీ సినిమాల గురించి మాట్లాడడమే చిత్రం. ఆ సంగతి అలా వుంచితే ఓ జాబితా చెప్పాలని చెప్పినట్లు వుంది కానీ కొత్త అస్సలు లేదు.

మురుగదాస్ తో సినిమా అన్నది ఏనాటి నుంచో వినిపిస్తున్న మాట. ఇవ్వాళ నిన్నటి సంగతి కాదు. కానీ అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో అన్నది తెలియదు. 

ఐకాన్ సబ్జెక్ట్ ఓకె చేసి చాలా కాలం అయింది. లేటెస్ట్ గా డైరక్టర్ వేణు శ్రీరామ్ కు నిర్మాత దిల్ రాజు కు మధ్య తేడా వచ్చిందని వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమా పుష్ప తరువాత వుంటుందని చెబుతున్నారు. పుష్ప సినిమా రెడీ కావాలంటే కనీసం ఏడెనిమిది నెలలు పట్టేలాగే వుంది. మరి అప్పటి వరకు వేణు శ్రీరామ్ అలా వెయిటింగ్ లో వుంటారా అన్నది చూడాలి.

బన్నీ వాస్ చెప్పలేదు కానీ విక్రమ్ కే కుమార్ కూడా బన్నీ వెయిటింగ్ లిస్ట్ లో వున్నారు. కొరటాల శివ సినిమా కూడా వుంటుందని ఓ మాటగా చెప్పారు. కానీ గ్యారంటీ లేదన్నది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి.

ఇక బోయపాటి సినిమా అన్నది మాత్రం పక్కా అని తెలుస్తోంది. మొత్తం మీద మిగిలిన హీరోల లైనప్ లు బయటకు వచ్చేసాయి కదా అని బన్నీ వాస్ ఈ లిస్ట్ విడుదల చేసినట్లుంది చూస్తుంటే.