బన్నీ సపోర్ట్ ఓ లేఖతో సరి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల నుంచి సపోర్ట్ రావాలి అంటే చిరంజీవి, బన్నీ, రామ్ చరణ్ కదలి రావాలి. కానీ ఆయనకు పిలచే ఆసక్తీలేదు. వీళ్లకు వెళ్లే ఆసక్తీ లేనట్లు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగా హీరోల నుంచి సపోర్ట్ రావాలి అంటే చిరంజీవి, బన్నీ, రామ్ చరణ్ కదలి రావాలి. కానీ ఆయనకు పిలచే ఆసక్తీలేదు. వీళ్లకు వెళ్లే ఆసక్తీ లేనట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ షూటింగ్ లో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నారు. చిరంజీవి కీలకమైన ఎన్నికల సమయంలో విశ్రాంతి కోసం ఛలో జపాన్ అన్నారు. బన్నీ మాత్రం నాగబాబు కోసం ప్రచారానికి వెళ్లారని టాక్ వినిపించింది. ఆరు తరువాత ఏ రోజైనా వెళ్లవచ్చని గుసగుసలు వినిపించాయి.

అయితే ఇప్పడు అలాంటి వ్యవహారం ఏమీలేదని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ కు అన్ని విధాలుగా తన మద్దుతు తెలియచేస్తూ ఓ లేఖ విడుదల చేసారు. నాగబాబుకు, పవన్ కు బన్నీ ఆ విధంగా మద్దతు తెలిపారు. ఆరున ఉగాది, ఏడున ఆదివారం జనాలు సెలవుల మూడ్ లో వుంటారు. ఎనిమిది బన్నీ బర్త్ డే. 9న ప్రచారం ముగింపు.

అందుకే ఇక వెళ్లేందుకు బన్నీకు అవకాశం లేదు. పైగా త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కోసం మేకోవర్ ట్రయ్ చేస్తున్నారు బన్నీ. ఇప్పుడు జనంలోకి వెళ్తే అది రివీల్ అయిపోతుంది. అందుకే ఓ లేఖతో పని కానిచ్చేసారు అని తెలుస్తోంది.

క్రెడిబులిటీని దెబ్బతీస్తున్న టీడీపీ.. పవన్ పాత్ర కూడా చాలానే