హీరో నిఖిల్ సిద్దార్ధ్ తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలుజిల్లా డోన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్, నిఖిల్‌కి 'అంకుల్' అట. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఈ ప్రచారం పవన్ అభిమానులకి కొంత ఆగ్రహం తెప్పించింది.
కారణం, నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలకడమే. పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటూ నిఖిల్, గతంలో పవన్‌తో కలిసి వున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, 'నీలాంటోళ్ళని నమ్మలేం' అంటూ జనసేన కార్యకర్తలుగా మారిన పవన్ కళ్యాణ్ అభిమానులు గుస్సా అయిపోయారు.
పవన్ అభిమానుల నుంచి వస్తోన్న విమర్శలతో నిఖిల్, తెలుగుదేశం పార్టీ తరఫున తాను ప్రచారం చేయడం గురించి వివరణ ఇచ్చాడు. తాను ఏ పార్టీ తరఫున రాజకీయాల్లో యాక్టివ్‌గా లేననీ, తన అంకుల్ ప్రతాప్ కోసం మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాననీ నిఖిల్ చెప్పుకొచ్చాడు. తాను ఎప్పటికీ పవన్‌కళ్యాణ్ అభిమానినేనని చెప్పుకున్నాడు నిఖిల్.
సినీనటుడు అలీ, తన స్నేహితుడైన పవన్‌కళ్యాణ్‌ని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాక, పవన్ అభిమానులు చాలా హర్టయ్యారు. పవన్ కళ్యాణ్ పట్ల సినీ పరిశ్రమలో ఎవరు అభిమానం ప్రదర్శించినా వారిని నమ్మలేకపోతున్నారు. ఇది ఒకరకంగా జనసేన అభద్రతాభావానికి నిదర్శనమేమో.!
లేకపోతే, 'జగన్ పెద్ద నాయకుడని అలీ నమ్మి వుండొచ్చు. అది ఆయనిష్టం. స్నేహం వేరు, రాజకీయం వేరు' అని పవన్ హుందాగా ప్రకటించాక, అభిమానులిలా హర్ట్ అవుతూ పోతోంటే ఎలా.?
క్రెడిబులిటీని దెబ్బతీస్తున్న టీడీపీ.. పవన్ పాత్ర కూడా చాలానే