షాకింగ్.. తెలంగాణలో ఈరోజు 75 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా కోరలు చాచింది. ఈరోజు ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు లెక్కతేలినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య అమాంతం 229కు పెరిగింది. Advertisement మరోవైపు…

తెలంగాణలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా కోరలు చాచింది. ఈరోజు ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు లెక్కతేలినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య అమాంతం 229కు పెరిగింది.

మరోవైపు ఈరోజు కరోనా వల్ల మరో ఇద్దరు మృతిచెందడంతో, మరణించిన వారి సంఖ్య 11కి చేరింది. ఈరోజు చనిపోయిన వారిలో ఒకరు షాద్ నగర్, మరొకరు సికింద్రాబాద్ కు చెందిన వారిగా ప్రకటించారు. అటు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈరోజు 15 మందిని డిశ్చార్జ్ చేశారు. దీంతో తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32కు పెరిగింది.

ఇక మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లందర్నీ గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లతో పాటు.. వారి కుటుంబ సభ్యులను ఐసొలేషన్ వార్డులకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీళ్లందరికీ యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 6 ల్యాబుల్లో 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సంఖ్య 2500 దాటింది. పాజిటివ్ కేసులు 2547కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 62 మంది చనిపోయినట్టు తెలిపిన కేంద్రం.. చాలామంది కోలుకుంటున్నారని కూడా స్పష్టంచేసింది.

ఆంధ్రాలో కRoన ని జయించిన యువకుడు