అప్పుడెప్పుడో పుష్కరం కిందట బొమ్మరిల్లు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. అదికాస్తా సూపర్ హిట్ అయింది. కట్ చేస్తే.. అదే బొమ్మరిల్లు తీసిన దర్శకుడు, ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈసారి కూడా దేవిశ్రీప్రసాద్ నే తీసుకున్నాడు. మరి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
కచ్చితంగా రిపీట్ అవ్వదంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ ఎలాంటి కథ సెలక్ట్ చేసుకున్నాడనే విషయాన్ని పక్కనపెడితే, కథ ఏదైనా దేవిశ్రీ ట్యూన్స్ మాత్రం ఒకేలా ఉంటాయనేది అతడిపై ప్రధానంగా వినిపిస్తున్న కంప్లయింట్.
తన ట్యూన్స్ ను తానే కాపీకొడుతూ ఆడియన్స్ ను బోర్ కొట్టిస్తున్నాడు దేవిశ్రీ. 4 సినిమాలొస్తే, అందులో ఒక సినిమాకు మాత్రమే కాస్త మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. మిగతావన్నీ అదే పాత చింతకాయ పచ్చడి బాణీలు. అంతెందుకు మొన్నటికిమొన్న మహర్షి మూవీ నుంచి ఓ పాట విడుదల చేస్తే అంతా పెదవి విరిచారు.
ఏమాత్రం కొత్తదనం లేదంటూ కామెంట్స్ చేశారు. మహేష్ బాబు సినిమాకే దేవిశ్రీ ఇలాంటి ట్యూన్స్ ఇచ్చాడంటే.. ఇక బొమ్మరిల్లు భాస్కర్ సినిమా గురించి చెప్పేదేముంది. అయినా ఎవరి సెంటిమెంట్స్ వాళ్లవి. అందుకే దేవిశ్రీని తీసుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. పైగా హీరో అఖిల్-దేవిశ్రీ కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇతడ్ని ఎంపిక చేయడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు.