ఏప్రియల్ 5న విడుదల కావాల్సి వుంది నాగచైతన్య-సమంతల మజిలీ సినిమా. ఇలాంటి టైమ్ లో సినిమాకు సంబంధించిన కీలక టెక్నీషియన్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్ సినిమాకు రీరికార్డింగ్ చేయడం తనకు ఇప్పుడు కుదరదని చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి గోపీసుందర్ ఇటు పాటలకు, అటు రీరికార్డింగ్ కు కలిపి బేరం ఆడుకుని, మొత్తం పారితోషికాన్ని మజిలీ నిర్మాతల నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ లాస్ట్ మినిట్ లో రీరికార్డింగ్ విషయంలో హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అర్జెంట్ గా వేరేదారి వెదుకుతున్నట్లు తెలుస్తోంది.
మ్యూజిక్ డైరక్టర్ ధమన్ ను నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఆయన కాస్త భారీ రేట్ కోట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కిందామీదా అవుతున్నారు. సరే ఏదో రేటుకు సెట్ చేసుకుంటారు. కానీ ఎంత అయినా అది అదనపు భారమే. లాస్ట్ మినిట్ టెన్షన్ నే.
గోపీసుందర్ ఇలా చేయడం సరైన దేనా అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సరైన మ్యూజిక్ డైరక్టర్ లు లేని కొరత గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ను పట్టి పీడిస్తోంది. ఎవరిని పరిచయం చేసి, ప్రోత్సహించినా, సరైన అడియోలు రావడంలేదు. దాంతో పక్కభాషల మ్యూజిక్ డైరక్టర్ లనే పట్టుకోవాల్సి వస్తోంది.
అందువల్ల అయితే చెన్నయ్ లేదా ముంబాయి, కేరళ వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్ లు చేయడం, రీ రికార్డింగ్ కోసం అక్కడకే వెళ్లి పడిగాపులు పడడం మామూలు అయిపోయింది. దీనికితోడు ఇలా హ్యాండ్ ఇవ్వడం లాంటి అదనపు కష్టాలు కూడా తప్పడంలేదు.