Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీతో మరో మల్టీస్టారర్.. అంతా ఉత్తిదే

వెంకీతో మరో మల్టీస్టారర్.. అంతా ఉత్తిదే

దాదాపు 2 రోజుల నుంచి ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో మల్టీస్టారర్ లో వెంకటేష్ నటించబోతున్నాడనేది ఆ వార్త. కానీ అదంతా కేవలం పుకారు అని అర్థమైంది. వీర పోట్ల దర్శకత్వంలో వెంకటేష్ ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడనే వార్తలో ఎలాంటి నిజంలేదు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయాలి వెంకీ. గతంలో ఇదే బ్యానర్ పై తేజ దర్శకత్వంలో మూవీ అనుకున్నారు. ఫొటోషూట్ కూడా జరిగింది. కానీ అంతలోనే ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత మరో దర్శకుడితో కలిసి వెంకీతో సినిమా చేద్దామని ట్రై చేశాడు అనీల్ సుంకర. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు తాజాగా వీరుపోట్ల పేరు తెరపైకి వచ్చింది. దాదాపు ఫేడ్ అవుట్ అయ్యే స్టేజ్ లో ఉన్న ఈ దర్శకుడు ఓ కథ రాసుకున్న మాట వాస్తవం. అనీల్ సుంకర రిఫరెన్స్ తో ఆ కథను వెంకీకి వినిపించిన మాట కూడా వాస్తవం. కానీ వెంకీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే మల్టీస్టారర్ అంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. వెంకీతో రవితేజ లేదా రానా నటించే ఛాన్స్ ఉందంటూ స్టోరీలు అల్లేశారు.

ప్రస్తుతం వెంకీ చేతిలో వెంకీమామ సినిమా మాత్రమే ఉంది. ఇందులో వెంకీ, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ కాకుండా మరే సినిమాను అఫీషియల్ గా ప్రకటించలేదు వెంకీ. 

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?