అడిగిన తడవ‌నే జగన్ మార్క్ వరాలు

విశాఖ వస్తేనే జగన్ కి హుషార్ వస్తుంది. ఆయన విశాఖను ఎపుడూ టాప్ ప్లేస్ లో ఉంచాలనే చూస్తారు. పాలనారాజధానిగా విశాఖను చేయాలని కూడా ముఖ్యమంత్రిగా జగన్ ప్రతిపాదించారు. అయితే అది న్యాయ వివాదాలలో…

విశాఖ వస్తేనే జగన్ కి హుషార్ వస్తుంది. ఆయన విశాఖను ఎపుడూ టాప్ ప్లేస్ లో ఉంచాలనే చూస్తారు. పాలనారాజధానిగా విశాఖను చేయాలని కూడా ముఖ్యమంత్రిగా జగన్ ప్రతిపాదించారు. అయితే అది న్యాయ వివాదాలలో ఉంది.

వాహహమిత్ర నాలుగవ విడత కింద నిధులను లబ్దిదారుల ఖాతాలో జమ చేయడానికి విశాఖకు వచ్చిన జగన్ ఈ సందర్భంగా నగరానికి వరాలు ఇచ్చారు. విశాఖలో ఇప్పటికే కొన్ని రెండు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. వాటితో పాటుగా హనుమంతువాక ప్రాంతంలో మరో ఫ్లై ఓవర్ నిర్మాణానికి యాభై కోట్లను వేదిక మీద ప్రకటించి జగన్ ప్రజల మద్దతు అందుకున్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ నిర్మాణం పనులకు పాతిక కోట్లను కేటాయిస్తూ జగన్ అక్కడికక్కడ ప్రకటించారు. అలాగే జోడుగుళ్ళపాలేం వద్ద మత్యకారులకు షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా జగన్ విపక్షాల మీద ధాటీగానే  విమర్శలు చేశారు. తెల్లారిలేస్తే వారు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం గత టీడీపీ కంటే తక్కువ అప్పులే చేసిందని, వాటిని కూడా లక్షా యాభై వేల కోట్ల రూపాయలుగా నేరుగా పేదల ఖాతాలో వేశామని చెప్పుకొచ్చారు. 

తమ సర్కార్ లో దాచుకోవడం, దోచుకోవడం లేనందువల్లనే ప్రజలకు పంచగలుస్తున్నామని ఆయన చెప్పడం విశేషం.