శ్రీనువైట్లకు అందుకే దూరమయ్యాను

దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోన వెంకట్ ది సూపర్ హిట్ కాంబినేషన్. కానీ ఇగో సమస్యల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. తాజాగా తమ మధ్య గొడవలపై కోన వెంకట్ మరోసారి స్పందించాడు. తన పనిని…

దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోన వెంకట్ ది సూపర్ హిట్ కాంబినేషన్. కానీ ఇగో సమస్యల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. తాజాగా తమ మధ్య గొడవలపై కోన వెంకట్ మరోసారి స్పందించాడు. తన పనిని శ్రీనువైట్ల గుర్తించలేదని, అందుకే విడిపోయానని ఆరోపించాడు.

“కాస్ట్యూమర్ 10 షర్టులు చూపిస్తే, దర్శకుడు ఒకటి సెలక్ట్ చేస్తాడు. అలాఅని తనే కాస్ట్యూమ్ డిజైనర్ అనుకుంటే ఎలా? నేను 10 పంచ్ డైలాగ్స్ రాస్తే శీను ఒకటి సెలక్ట్ చేసుకునేవాడు. తను దాన్ని ఇంకాస్త బెటర్ చేసేవాడు. అలాఅని ఆ డైలాగ్ తనది అయిపోదు కదా. అక్కడే సమస్య వచ్చింది. నేనే అన్నీ చేశాను అనే ఫీలింగ్ శీనుకు వచ్చినట్టుంది. నా కంట్రిబ్యూషన్ అతడు గుర్తించలేదని అనిపించింది. అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.”

శ్రీనువైట్ల దగ్గర తనకు తగిన గుర్తింపు రాలేదంటున్నాడు కోన. అందుకే తప్పుకున్నానని తెలిపాడు. తమమధ్య పగలు-ప్రతీకారాలు లేవని… అన్నీ సెట్ అయితే మళ్లీ సినిమా చేస్తామంటున్నాడు. శ్రీనుతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నాడు.

“కొన్ని కథలు శ్రీనువైట్లనే బాగా తీయగలడు. అతడికి కామెడీ టైమింగ్ బాగా తెలుసు. శ్రీనుకు ఉన్న బలానికి నా కథలు హెల్ప్ అయ్యాయి. అలాగే శ్రీను బలం నాకు హెల్ప్ అయింది. ఇది మ్యూచువల్. షేక్ హ్యాండ్ లాంటిదన్నమాట. ఆ షేక్ హ్యాండ్ ఎక్కడో విడిపోయింది. మళ్లీ కలవాలనే కోరుకుంటున్నాను.”

ఇలా వైట్లతో తనకున్న వైరాన్ని బయటపెట్టాడు కోన. ప్రస్తుతం వీళ్లిద్దరూ కెరీర్ పరంగా డౌన్ ఫాల్ లో ఉన్నారు. సో.. కోన మాటలు చూస్తుంటే వీళ్లిద్దరూ త్వరలోనే కలిసేలా ఉన్నారు.

నీ ఆస్థి ఐశ్వర్యం ఆంధ్ర ప్రజల బిక్ష అని మర్చిపోకు

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని