టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరోనాను ఎదుర్కొనేందుకు తన వంతుగా ఏపీ సర్కార్‌కు రూ.10 లక్షలు విరాళం ప్రకటించాడు. అలాగే తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాన్ని ఇవ్వాలని ఆదేశించాడు. బాబు విరాళం మాత్రం లక్షల్లో ఉంటే…ఆయన డిమాండ్లు మాత్రం “కోట్లు” దాటుతున్నాయి. రూ.1000 కోట్లు విరాళం ఇచ్చినా తరగని ఆస్తిని కూడగట్టుకున్న బాబు…కనీసం కరోనాతో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే, రాష్ట్రానికి ఏదైనా సాయం చేయడానికి ఆయనకు మనసు రాలేదు.
అధికారం నుంచి బాబు దిగిపోతూ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయిన విషయం అందరికీ తెలుసు. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు తగదునమ్మానంటూ జగన్ సర్కార్‌ను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది.
కరోనా విజృంభణతో ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు అందచేయాలని కోరుతూ మంగళవారం సీఎం జగన్‌కు చంద్రబాబు ఓ లేఖ రాశాడు. ఇప్పటికే జగన్ పేదలకు సాయం అందించేందుకు మార్చి 29 నుంచే ఉచితంగా రేషన్ పంపిణీ చేపట్టాడు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో పేద కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున ఏప్రిల్ 4న ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని ప్రకటించాడు.
నిజంగా పేదలపై చంద్రబాబుకే ప్రేమే ఉంటే మొక్కుబడిగా కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఎందుకిచ్చాడు? అందులోనూ అందరికంటే ముందుగా ఈ మొత్తాన్ని ప్రకటించడంలోనూ ఓ వ్యూహం ఉంది. బాబు ఆలోచనల్లోని దుర్మార్గం ఈ విషయంలోనే బయటపడింది. అందరి కంటే ముందు తానే స్పందించి రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించానని చెప్పుకుంటున్న బాబు…అలా ప్రకటించడంలోని కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక్కోలేరని అనుకుంటున్నాడు.
ముందే విరాళం ప్రకటిస్తే తక్కువ సొమ్ముతో అయిపోతుందని, అందులోనూ తానే మొదట స్పందించానని ప్రచారం చేసుకోవచ్చనేది బాబు ఎత్తుగడ. గత వారం రోజులుగా గమనిస్తే హీరో ప్రభాస్ రూ.4 కోట్లు, చిరంజీవి రూ.2 కోట్లు, ఇలా ప్రతి ఒక్కరూ కోటి రూపాయలకు తక్కువ కాకుండా విరాళాలు ప్రకటిస్తున్నారు. అంతెందుకు చంద్రబాబు తమ్ముని కుమారుడు హీరో నారా రోహిత్ తన శక్తికి మించి రూ.30 లక్షలు విరాళం ఇచ్చాడు.
అలాంటిది గత ఐదేళ్లలో రెండు లక్షల కోట్లకు పైగా రాష్ట్రానికి అప్పులు మిగిల్చిన బాబు ఆస్తిపాస్తులు ఏ మాత్రం పెరిగి ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. కరోనా కంటే పెద్ద విపత్కర పరిస్థితులు ఏముంటాయ్? ఈ సమయంలో కూడా పేదలను ఆదుకోడానికి బాబుకు మనసు ఎందుకు రావడం లేదు? పేద కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేయాలని జగన్ సర్కార్‌కు లేఖ రాస్తానే తన బాధ్యత తీరిపోతుందా? అసలు అలా డిమాండ్ చేసే నైతిక హక్కు బాబుకు ఉందా? అలా చేయాలి, ఇలా చేయాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఒక్కసారి టాటా ట్రస్ట్, రిలయన్స్ సంస్థలతో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ దాతృత్వాలను చూసి స్ఫూర్తి పొందితే మంచిది.
అలా కాకుండా లేఖలతో పేదలతో కడుపు నిండుతుందని , మీడియా ముందుకొచ్చి డిమాండ్లు చేయడానికి ఇలా చేయడం బాబుకు సిగ్గు అనిపించలేదా అని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.