మొత్తానికి రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కొలిక్కివచ్చింది. సిట్టింగ్ ఎంపీ మురళీ మోహన్ ఇక పోటీచేయను అని చెప్పడంతో సమస్య స్టార్ట్ అయింది. ఎవర్ని పోటీకి నిలపాలా? అన్న దానిపై రకరకాల ఆలోచనలు సాగాయి. రకరకాల పేర్లు వినిపించాయి. రకరకాల సమీకరణాలు వినిపించాయి.
ఒకదశలో విశాఖ నుంచి బాలయ్య చిన్న అల్లుడు భరత్ ను ఇక్కడకు దిగుమతి చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఆఖరికి మళ్లీ మాగంటి మురళీమోహన్ కుటుంబానికే టికెట్ కేటాయిస్తున్నట్లు బోగట్టా. ఆరంభంలో వినిపించిన మురళీమోహన్ కోడలు రూప పేరునే ఇప్పుడు ఫైనల్ చేస్తున్నారట. ఈ పేరు ఈరోజు తిరుపతిలో చంద్రబాబు ప్రకటిస్తారు.
రాజమండ్రిలో జనసేన తరపున బలమైన అభ్యర్ధిగా ఆకుల సత్యనారాయణ రంగంలో వున్నారు. వైకాపా అభ్యర్థి ఎవరో తేలలేదు. వైకాపా కూడా కమ్మ సామాజిక వర్గానికే సీటు కేటాయిస్తే, కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అభ్యర్థి విజయం ఈజీ అవుతుంది. లేదూ వైకాపా కాపు సామాజిక వర్గానికి సీటు ఇస్తే, తెలుగుదేశం పని సులువు అవుతుంది.