Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫుల్ లెంగ్త్ విలన్ గా నాని

ఫుల్ లెంగ్త్ విలన్ గా నాని

విలన్ పాత్ర లేదా విలన్ షేడ్ పాత్ర చేయడం అన్నది హీరోలు చాలామంది ట్రయ్ చేసిందే. హీరో నాని కూడా గతంలో జెంటిల్ మన్ సినిమాలో ఓ నెగిటివ్ షేడ్ పాత్రను పోషించాడు. అయితే ఇప్పుడు తొలిసారిగా పూర్తిస్థాయి విలన్ గా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

జెంటిల్ మన్ సినిమాను అందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణనే ఇప్పడు ఈ సినిమా కూడా అందిస్తున్నారు. ఈ సినిమాలో నానిదే కీలకపాత్ర. పైగా విలన్ పాత్ర. ఇదే సినిమాలో హీరోగా సుధీర్ బాబు కనిపిస్తారు. ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. విలన్ అయినా కూడా నానికి మాంచి జోడీని సెట్ చేసారు.

అదితీరావ్ ను ఆయన పక్కన జోడీగా ఎంపిక చేసారు. అంటే విలన్ పాత్రే కానీ, హీరోయిజానికి లోటు వుండదన్నమాట. ఇదిలావుంటే ఈ సినిమాకు అమిత్ త్రివేది, మణిశర్మ, సంతోష్ నారాయణ్ ల్లో ఒకరిని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎవరయితే వీలయినంత తక్కువ ఖర్చుతో జరుగుతుందని ఆలోచిస్తున్నట్లు బోగట్టా.

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?