హైప్‌ కోసం రాజమౌళి పాట్లు?

ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారనేదే తెలుగు మార్కెట్‌ వరకు అతి పెద్ద సంచలనం. ఇక అగ్నికి వాయువు తోడయినట్టు రాజమౌళి బ్రాండ్‌ కూడా వుండనే వుంది. అయితే తెలుగు మార్కెట్‌ని దాటి…

ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారనేదే తెలుగు మార్కెట్‌ వరకు అతి పెద్ద సంచలనం. ఇక అగ్నికి వాయువు తోడయినట్టు రాజమౌళి బ్రాండ్‌ కూడా వుండనే వుంది. అయితే తెలుగు మార్కెట్‌ని దాటి వెళితే ఈ కాంబినేషన్‌లో రాజమౌళి బ్రాండ్‌కి తప్ప విలువ లేదు. అందుకే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రానికి ఇతర మార్కెట్లలో క్రేజ్‌ తేవడం, పాన్‌ ఇండియా అప్పీల్‌ రాబట్టడంపై రాజమౌళి టీమ్‌ ఆలోచనలో పడింది.

చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ యాక్షన్‌ హీరోలు కనుక యాక్షన్‌ ప్రధానమైన కథని ఎంచుకున్నారు. ఇద్దరికీ సమవుజ్జీలనిపించే పాత్రలని సిద్ధం చేసారు. అయితే ఆ కథకి పాన్‌ ఇండియా అప్పీల్‌ రావాలంటే ఇరకేదో కావాలి. అందుకే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ జీవితాల్లో మిస్సింగ్‌ చాప్టర్‌ ఈ చిత్రమని చెబుతూ హిస్టారికల్‌ ఆక్యురసీ లేదంటారని ఇది పూర్తిగా కల్పిత కథ అంటున్నారు.

ఈ ఎక్సర్‌సైజ్‌ అంతా ఈ చిత్రానికి తెలుగేతర మార్కెట్లలో హైప్‌ కోసమని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవైల ప్రాంతంలో జరిగిన కథ అంటే విజువల్‌ గ్రాండియర్‌కి, గ్రాఫిక్స్‌కి చోటు దక్కుతుంది. తద్వారా ఇతర మార్కెట్లలో ఈ చిత్రానికి హైప్‌ క్రియేట్‌ అవుతుంది.

అయితే దీనికోసం రాజమౌళి పెద్ద రిస్కే చేస్తున్నాడని చెప్పాలి. ఇద్దరు మహనీయుల కథ అనేసరికి పూర్తి స్థాయిలో సినిమాటిక్‌ లిబర్టీ తీసుకునే వీలుండదు. మరి ఆ రిస్ట్రిక్షన్స్‌కి లోబడి రాజమౌళి మార్కు హీరోయిజం ప్లస్‌ మసాలాలు ఎలా పండిస్తాడనేది ఆసక్తికరం.

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!