Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అత్యంత భారీ తారాగణంతో...

అత్యంత భారీ తారాగణంతో...

పూర్యం రోజుల్లో సినిమాల ప్రచారానికి ఈ పదం చాలా ఎక్కువగా వాడేవారు. దానికి తగినట్లు బోలెడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమా నిండా కనిపించేవారు. కానీ రాను ఈ రోజుల్లో మైక్రో సినిమాలు ఎక్కువయ్యాయి. హీరో, హీరోయిన్, విలన్, మహా అయితే మరో ఒకరిద్దరు క్యారెక్టర్లు మాత్రమే కీలకంగా వుంటున్నాయి.

అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు మాత్రం ఇందుకు భిన్నంగా వుంటాయి. ఆయన సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ కు అయినా కాస్త నోటెడ్ యాక్టర్ కావాల్సిందే. అందుకే ఆయన సినిమాలో బోలెడు మంది తారాగణం వుంటారు.

లేటెస్ట్ గా ఆయన అల్లుఅర్జున్ హీరోగా చేయబోతున్న సినిమాలో కూడా చాలా భారీ తారాగణం వుంటుందట. తమిళ రంగానికి చెందిన సత్యరాజ్, మళయాల రంగానికి చెందిన జయరామ్, మన రావురమేష్, సీనియర్ నరేష్ ఇలా చాలామంది యాక్టర్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఈ అదనపు తారాగణంతో పాటు, మెయిన్ హీరోయిన్ పూజాహెగ్డే, మరో అదనపు హీరోయిన్ వుంటారు.

వీరుకాక, ఆ  మధ్య దాకా తెలుగు జనాలకు హీరోయిన్ గా పరిచయం, గుర్తువున్న ఓ సీనియర్ హీరోయిన్ హీరో తల్లిగా కనిపించబోతున్నారు. ఇంతమంది కాల్ షీట్లు, కాంబినేషన్లు సెట్ చేసుకుని, సెట్ మీదకు రాబోతోందీ సినిమా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?