Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నానితో అదితి రావ్

నానితో అదితి రావ్

దర్శకుడు ఇంద్రగంటి తెలుగుతెరకు పరిచయం చేసిన మంచినటి అదితి రావ్. మళ్లీ ఆయనే ఆమెను మరో మంచి పాత్రకు తీసుకున్నారు. నాని-సుధీర్ బాబులతో ఇంద్రగంటి చేయబోయే సినిమాలో అదితిరావ్ నే కథానాయిక. సినిమాలో ఆమె నాని సరసన కనిపించబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న సుధీర్ బాబుకు మాత్రం హీరోయిన్ దొరికినట్లే దొరికి చేజారిపోయింది. నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ ఆమెతో రెమ్యూనిరేషన్ దగ్గర తేడా వచ్చినట్లు బోగట్టా. ఏకంగా కోటి రూపాయలకు తగ్గేదిలేదని ఆమె నుంచి కబురు వచ్చినట్లు, దాంతో దిల్ రాజు వేరేవాళ్లను చూసుకుందామని అన్నట్లు తెలుస్తోంది.

ఆ విధంగా నివేదా ధామస్ మంచి చాన్స్ మిస్సయిపోయింది. ఇటు ఇంద్రగంటి లాంటి దర్శకుడు, అటు దిల్ రాజు లాంటి నిర్మాత ప్రాజెక్టును మిస్ చేసుకుంది నివేదా థామస్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?