కీరవాణి కరోనా కానుక

గాలికి పోయే పేల పిండిని చూసి కృష్ణార్పణం అన్నాడట వెనకటికి ఎవడో. మన సినిమా సెలబ్రిటీలు చాలా మంది చేసే పని అదే. పైసా విదల్చకుండా, ప్రవచనాలు మాత్రం ఫ్రీగా విడియోల రూపంలో వదులుతుంటారు.…

గాలికి పోయే పేల పిండిని చూసి కృష్ణార్పణం అన్నాడట వెనకటికి ఎవడో. మన సినిమా సెలబ్రిటీలు చాలా మంది చేసే పని అదే. పైసా విదల్చకుండా, ప్రవచనాలు మాత్రం ఫ్రీగా విడియోల రూపంలో వదులుతుంటారు. వాటిని సోషల్ మీడియాలో జనాలు వైరల్ చేస్తుంటారు. ఇదే తమ కానుక, ఇదే ఎక్కువ అనుకుంటారు సదరు సెలబ్రిటీలు.

తెలుగు ఇండస్ట్రీలో సినిమాకు రెండు కోట్లకు పైగా తీసుకునే సంగీత దర్శకుడు కీరవాణి కరోనా నేపథ్యంలో ఇటు ఇండస్ట్రీకి కానీ అటు ప్రభుత్వానికి కానీ పైసా విదల్చలేదు. ఆయన, ఆయన భార్య, ఆయన కొడుకులు అందరూ ఇండస్ట్రీ మీద వున్నవారే. 

ఎవరేమనుకుంటే మాకేం, మా పద్దతి మాది అనుకుంటారేమో? కానీ మరీ ఏమీ చేయకుండా వుంటే బాగుండదనేమో, రెడీగా వున్న పాత పాట మ్యూజిక్ ట్రాక్ బయటకు దుమ్ము దులిపి తీసి, దానికి రీమిక్స్ గీతం అల్లేసి, ఇదే మా కరోనా కానుక అన్నట్లు వదిలేసారు. 

ఇలా కోట్లు ఆర్జించిన వారి కన్నా టాలీవుడ్ లో వున్న చిన్న చిన్నవాళ్లే మిన్న. ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని

ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ నాలుగు రోజులు ఒక ఎత్తు