చరణ్ మీసం.. ఓ మోసం

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించేసారు దర్శకుడు రాజమౌళి. కథలోని కీలక పాయింట్ అయిన ఇద్దరు వ్యక్తులు, దేశభక్తులుగా మారిన వైనం తెరపై చూపించబోతున్నట్లు చెప్పారు. పాయింట్ ఎగ్జయిటింగ్ గా…

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించేసారు దర్శకుడు రాజమౌళి. కథలోని కీలక పాయింట్ అయిన ఇద్దరు వ్యక్తులు, దేశభక్తులుగా మారిన వైనం తెరపై చూపించబోతున్నట్లు చెప్పారు. పాయింట్ ఎగ్జయిటింగ్ గా వుంది. మామూలుగా ఇద్దరు వ్యక్తులు ఎలా స్టార్ట్ అయి, ఎలా దేశభక్తులుగా మారారు అన్నది సినిమా అంటే ఈ ఎగ్జయిట్ మెంట్ వుండేది కాదు. అందుకే రాజమౌళి తెలివిగా కొమరం భీమ్, అల్లూరిల కథలోని తెలియని కోణం అనే మసాలా పాయింట్ తగిలించారు.

ఇక మిగిలినదంతా మామూలే. ఇళ్ల నుంచి నార్త్ కు వెళ్లిన యువకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నారు. ఎవరిని ఎదిరించి పోరాడారు. అలాంటి టైమ్ లో వారిలోని పోరాట పటిమను గమనించి ఎవరు వాళ్లను దేశంపోరు దిశగా మళ్లించారు. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు. అన్న సాదా సీదా మామూలు కథ. దాన్ని లార్జర్ దాన్ లైఫ్ సైజ్ లో రాజమౌళి స్టయిల్ లో చూపిస్తారన్నమాట.

ఇదిలావుంటే హీరోల గెటప్ లు బయటకు రివీల్ కాకుండా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు రాజమౌళి. చాలా తెలివిగా హీరోలు ఇద్దరికీ టోపీలు తగిలించి తీసుకువచ్చారు. అంతేకాదు సినిమాలో రామ్ చరణ్ మీసం ఇలా వుండదు. ఇదే మీసం ఇంతపొడవుగానూ వుంటుంది. కానీ చివర్న పైకి మెలితిరిగి వుంటుంది.

కానీ ఇప్పుడు కావాలని అసలు మీసం కనపడకుండా, దాన్ని కిందకు దువ్వేసి, బాగా నొక్కిపెట్టి, అప్పుడు చరణ్ ను మీట్ కు తీసుకువచ్చారు. ఓ విధంగా రాజమౌళి కావాలని చరణ్ మీసం విషయంలో మోసం చేసేసారు.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!