రొమాంటిక్ సీన్లను చూసే జనాల స్పందన ఎలా ఉంటుందో ఎవరికీ చెప్పనక్కర్లేదు. ఇంతకీ వాటిల్లో నటించే వాళ్ల స్పందనే పెద్దగా రికార్డు కాదు. పాతకాలం నటీనటులు ఈ విషయంలో ఆఫ్ ద రికార్డుగా స్పందించిన దాఖలాలున్నాయి.
ఒక నాటి స్టార్ హీరోయిన్ రేప్ సీన్ల విషయంలో తనతో ఏమనేదో మరో మాజీ స్టార్ విలన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సీన్లలో మరీ మొహమాటంగా నటించనక్కర్లేదంటూ ఆ హీరోయిన్ విలన్ పాత్రధారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదట. ఇక బాలీవుడ్ స్టార్ విలన్ పరేష్ రావల్ ఈ విషయంలో చాలా యేళ్ల కిందటే స్టేట్ మెంట్ ఇచ్చాడు. రేప్ సీన్లలో హీరోయిన్లు చాలా ఇబ్బంది పడతారంటూ పరేష్ చెప్పాడప్పట్లో. రేప్ సీన్ల సంగతలా ఉంటే.. రొమాంటిక్ సీన్లది మరో కథ.
ఈ విషయంలో ఈ మధ్య రచ్చలు కూడా జరుగుతున్నాయి. ఫలానా రొమాంటిక్ సీన్ చిత్రీకరించినప్పుడు హీరో తనతో ఓవర్ చేశాడంటూ కూడా కొంతమంది హీరోయిన్లు మీ టూ అంటున్నారు. అలాగే వారు దర్శకులను కూడా బుక్ చేస్తున్నారు! ఇలాంటి నేపథ్యంలో నటి పరిణీతి చోప్రా ఈ అంశం గురించి స్పందించడం ఆసక్తిదాయకంగా ఉంది.
బాలీవుడ్ లో పరిణీతి పలు హాట్ సీన్లలో నటించింది. లిప్ కిస్ సీన్లలో కూడా పరిణీతి దుమ్ము రేపింది. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి ఈమె స్పందిస్తూ.. రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ సమయంలో కట్ అంటే కట్ అని పరిణీతి చెబుతోంది. ఆ తర్వాత అందుకు సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని పరిణీతి చెప్పింది.
రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తిగా యాంత్రికంగా జరుగుతుందని ఈ హీరోయిన్ అంటోంది. అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవనేది ఈమె మాట. మరి నటించిన వారికి ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా.. వీటి కోసం జనాలు యూట్యూబ్ లో కూడా తెగ శోధిస్తూ ఉంటారనమాట!