వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీల జాబితాలోకి సాహో హీరోయిన్ ఎవ్లీన్ శర్మ కూడా చేరిపోయింది. సాహోలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా తుషాన్ భిందీతో డేటింగ్ చేస్తోంది. అలా ఏడాదిగా లవ్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు అతడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
తన పెళ్లికి సంబంధించిన ఫొటోల్ని ఎవ్లీన్, కొద్దిసేపటి కిందట బయటపెట్టింది. అయితే ఆమె పెళ్లి మాత్రం చాలా రోజుల కిందటే జరిగింది. మే 15న ఈ జంట పెళ్లితో ఒకటైంది. ఆ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది ఎవ్లీన్. వరుసగా ఓ 4 ఫొటోలు కూడా రిలీజ్ చేసింది.
ఎంగేజ్ మెంట్ టైమ్ లో కూడా ఇలానే చేసింది ఎవ్లీన్. 2019 అక్టోబర్ లో సిడ్నీ హార్బర్ దగ్గర్లో వీళ్ల ఎంగేజ్ మెంట్ జరిగితే, అది జరిగిన నెల రోజుల తర్వాత నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు పెళ్లికి కూడా అదే పద్ధతి ఫాలో అయింది. పెళ్లయిన 3 వారాలకు ఆ విషయాన్ని వెల్లడించింది.
తుషాన్ ఆస్ట్రేలియాలో డాక్టర్. ఔత్సాహిక పారిశ్రామికవేత్త కూడా. 2018లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్లిద్దరికీ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఈ జంట ఒక్కటైంది. కరోనా వల్ల వీళ్ల పెళ్లి సింపుల్ గా జరిగింది.
యే జవానీ హే దీవాని సినిమాతో పాపులరైంది ఎవ్లీన్. ఆ తర్వాత నాటౌంకీ సాలా, మై తేరా హీరో, హిందీ మీడియం లాంటి సినిమాల్లో నటించింది. సాహో సినిమా ఆమెను సౌత్ కు పరిచయం చేసింది.