మార్పు అంటే అసలైన అర్ధం చెప్పిన ధర్మాన

మార్పు రావాలి అని అంతా అంటూంటారు. అది వట్టి పడికట్టు మాటగానే ఎప్పటికీ మిగిలిపోతోంది.  Advertisement అయితే మార్పు అంటే ఏంటో చాలా సూక్ష్మంగా వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరించారు. మార్పు అంటే…

మార్పు రావాలి అని అంతా అంటూంటారు. అది వట్టి పడికట్టు మాటగానే ఎప్పటికీ మిగిలిపోతోంది. 

అయితే మార్పు అంటే ఏంటో చాలా సూక్ష్మంగా వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరించారు. మార్పు అంటే ప్రతీ మనిషీ ఆత్మ విశ్వాస్వంతో బతకడమే అని ఆయన నిర్వచించారు.

తమ ప్రభుత్వ పాలనలో అది తుచ తప్పకుండా సాగుతోందని చెప్పారు. సమాజం ఆ రకమైన మార్పు దిశగా గత మూడేళ్ళుగా సాగుతోందని ఆయన అన్నారు. 

తమది సంక్షేమ ప్రభుత్వమని కూడా ఆయన అభివర్ణించారు. పేదలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వానికి అమలు చేస్తున్న సంక్షేమానికి ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ జనాలు కోరుకున్నదే ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని అన్నారు. 

గ్రామ సచివాలయాల ద్వారా పాలన నేరుగా ప్రజల ఇంటి వద్దకు చేరుతోందని మంత్రి చెప్పారు. మరి పంచుడు కార్యక్రమాలు అని అవగాహన లేకుండా అవహేళన చేస్తున్న వారు మార్పు ఏమిటో మంత్రి గారి నిర్వచనం వింటే బాగుంటుందేమో.