సెప్టెంబర్ 9… ‘మీకు బాగా..’

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న సినిమా ‘మీకు బాగా కావాల్సిన వాడిని’. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న ఈ సినిమా ను సెప్టెంబర్…

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న సినిమా ‘మీకు బాగా కావాల్సిన వాడిని’. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న ఈ సినిమా ను సెప్టెంబర్ 9న విడుదల చేయాలని డిసైడ్ చేసారు. 

రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన సినిమా టీజర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. 

సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.