సైలెంట్ గా సాధించిన పివీపి

బయట ప్రపంచానికి అంతగా తెలియకున్నా, వైకాపా అంతర్గత వర్గాలకు మాత్రం తెలుసు విజయవాడ ఎంపీ సీటుకు పరిశీలనలో వున్న పేర్లలో పివిపి పేరు ఒకటి అని. అయితే అలా అని ఎక్కడా ఒక్కసారి కూడా…

బయట ప్రపంచానికి అంతగా తెలియకున్నా, వైకాపా అంతర్గత వర్గాలకు మాత్రం తెలుసు విజయవాడ ఎంపీ సీటుకు పరిశీలనలో వున్న పేర్లలో పివిపి పేరు ఒకటి అని. అయితే అలా అని ఎక్కడా ఒక్కసారి కూడా పివిపి బయటకు రాలేదు. ఏ రాజకీయ సమావేశాల్లో కనిపించలేదు.

ఆయన వ్యాపారాలు ఆయన చేసుకోవడం మినహా, మరే విధమైన రాజకీయ సంబంధిత కార్యక్రమాలకు ఆయన హాజరుకాలేదు. నిజానికి పివిపికి అన్ని రాజకీయ పక్షాల్లో మిత్రులు వున్నారు. దాదాపు అన్ని పార్టీల ప్రముఖులతో సాన్నిహిత్యం వుంది.

అయితే ఇటీవల దాసరి జై రామ్ రమేష్ వైకాపా తీర్థం పుచ్చుకోవడంతో పివిపి పేరు వెనక్కు వెళ్లిపోయినట్లు కనిపించింది. పివిపి అప్పుడు కూడా ఎక్కడా ఏమాత్రం బయటపడలేదు. సైలంట్ గానే వున్నారు. జగన్ ను కలిసినట్లు దాఖలాలు కూడా లేవు.

కానీ ఇప్పుడు వున్నట్లుండి మళ్లీ పివిపి పేరు బయటకు వచ్చింది. ఆయన జగన్ ను రేపు కలిసి వైకాపాలో చేరబోతున్నారు. ఈమేరకు అంతా దాదాపు ఫిక్స్ అయిపోయింది. పివిపి ది కృష్ణాజిల్లానే. ఆయన విజయవాడలో కూడా వ్యాపారాలు, వ్యవహారాలు వున్నాయి.

గతంలో 2014లోనే విజయవాడ సీటును పివిపి ఆశించారు. పవన్ కళ్యాణ్ జనసేనకు అప్పట్లో భారీగా పెట్టుబడి పెట్టి, పవన్ విధానాలు నచ్చక దూరంగా వుండిపోయారు. ఎంపీగా పోటీ చేయాలన్నది పివిపి కోరిక. ఇన్నాళ్లకు పివిపి కోరిక తీరబోతోంది. 

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..